సాధన దీక్షను లైట్ తీసుకున్న లోకేష్.. కారణం ఏంటి..?
దీక్షతో సాధించిందేంటి..?
సాధన దీక్షకు పరిమితంగా నాయకుల్ని మంగళగిరి పిలిపించారు. బహిరంగ దీక్ష చేసే అవకాశం లేదు కాబట్టి ఎన్టీఆర్ భవన్ పార్టీ ఆఫీస్ లో దీన్ని పూర్తి చేశారు. అయితే మిగతా నాయకులంతా జూమ్ ద్వారా ఈ దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూమ్ వీడియోలో నాయకులు వీక్షించారు, సంఘీభావం తెలిపారు. రోజంతా దీక్ష జరుగుతుందనుకున్నా.. కేవలం గంటల వ్యవధిలోనే దాన్ని ముగించారు. దీక్ష ముగించిన తర్వాత నిరసన ప్రదర్శనలుంటాయనుకున్నా కూడా అలాంటివేవీ షెడ్యూల్ లో లేవు. కొవిడ్ నిబంధనల మేరకు క్లుప్తంగా దీక్షను ముగించాల్సి వచ్చిందని టీడీపీ నేతలంటున్నారు. కారణాలేవయినా నిరసన వారం పేరుతో టీడీపీ చేసిన హడావిడికి ఎక్కువమార్కులు పడలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోయి, అన్ లాక్ నిబంధనలు అమలులోకి వచ్చిన ఈ సమయంలో.. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అంటూ చంద్రబాబు చేసిన డిమాండ్ ని ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంది. మంత్రి ఆళ్ల నాని మాత్రమే చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ విమర్శలంటూ బాబు వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. మొత్తమ్మీద టీడీపీ సాధన దీక్షకు అనుకున్నంత మైలేజీ దక్కలేదని తెలుస్తోంది.