యోగి ఆదిత్యానాథ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పని మోడీ..? దేనికి సంకేతం..?

యోగి ఆదిత్యానాథ్.. ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టడైన రాజకీయ నాయకుడు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో గెలవగానే... అందరినీ కాదని.. యోగికి పట్టం కట్టేశారు. అయితే అప్పట్లో యోగిపై నరేంద్రమోడీకి ఉన్న ప్రేమ..ఇప్పుడు కనిపించడమే లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ యోగికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
అసలే యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో ఏడాదిలోనే ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి అంత బావున్నట్టు లేదు. దీనికి తోడు కరోనా మేనేజ్‌ మెంట్‌లో కేంద్రంలో మోడీలాగానే ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి కూడా అట్టర్ ఫ్లాప్ అయినట్టు కథనాలు వెలువడ్డాయి. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు యోగి పాలన తీరు కూడా ప్రజలకు నచ్చట్లేదన్న వార్తల నేపథ్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అటు ఎస్సీ, బీఎస్పీ మళ్లీ పుంజుకోవడం కూడా కమల దళానికి గుబులు పుట్టిస్తోంది.  
సరిగ్గా ఈ సమయంలో యోగి ఆదిత్యానాథ్‌ పుట్టిన రోజుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి విషెష్ చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహజంగా అందరు సీఎంల పుట్టిన రోజులకు ప్రధాని ట్విట్టర్ ద్వారా విషెష్ చెబుతుంటారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మోడీ విషెష్ చెబుతుంటారు. నిన్న యోగి ఆదిత్యానాథ్‌ పుట్టిన రోజు.. సహజంగా యోగి సీఎం అయ్యాక.. ప్రతి పుట్టిన రోజుకూ ప్రధాని విషెష్ చెబుతూనే ఉన్నారు.
యోగికి గత నాలుగేళ్లుగా ట్విట్టర్ ద్వారా విషెష్ చెబుతున్న మోదీ.. ప్రతి ఏటా కాస్త మేటర్ మారుస్తూ వస్తున్నారు. 2017 లో యూత్ పుల్ & డైనమిక్ లీడర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు.  2018 లో యోగి బాగా కష్టపడుతున్నాడని మెచ్చుకున్నారు. 2019 లో యోగి డైనమిక్ నాయకత్వంలో యూపీ అభివృద్ధి చెందాలని కోరారు. 2020 లోనూ యోగి డైనమిక్ లీడర్ అని.. యూపీ ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలన్నారు. కానీ.. సరిగ్గా ఎన్నికల ముందు.. ఈ ఏడాది మాత్రం అసలు శుభాకాంక్షలే చెప్పలేదు. ఇప్పడు ఇదే బీజేపీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: