రూ. 8 లక్షల కోట్లు ఖర్చు చేయండి.. మోడీకి ఓ మేధావి సలహా..?

కరోనా అన్ని రంగాలనూ దెబ్బ తీసింది. ఉద్యోగస్తులు, కూలీలు, రైతులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారిపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపింది. కొందరికి నెలల తరబడి ఉపాధి కరవైంది. మరికొందరి వేతనాల్లో కోత ఏర్పడింది. మరికొందరు అసలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. కరోనా ప్రభావంతో దేశంలో మళ్లీ పేదరికం పెరుగుతోంది. అయితే.. కరోనా బారి నుంచి పేదలను బయటపడేయాలంటే ఏంచేయాలి..


ఈ అంశంపై అనేక మంది మేధావులు ఆలోచిస్తున్నారు. కరోనా కారణంగా పేదలైన వారిని, ఆదాయం కోల్పోతున్న వివిధ వర్గాల వారిని ఆదుకోవడానికి కనీసం ఎనిమిది లక్షల కోట్లు అయినా వ్యయం చేయాలట. ఇదీ యూనివర్శిటీ ఫ్రొపెసర్ అమిత్ బోస్లే అనే మేధావి మాట. గతంలో ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఒక ప్యాకేజీని ప్రకటించినా, అది ఎక్కువగా రుణాల పంపిణీగానే ఉంది. రాష్ట్రాలకు కాని, ప్రజలకు కాని నేరుగా డబ్బు ఇచ్చే స్కీములు ఆశించిన విధంగా లేవు. అమెరికా వంటి సంపన్నదేశాలు బిలియన్ల కొద్ది డాలర్లను తమ దేశ ప్రజల బ్యాంకు ఖాతాలలో వేయడం ద్వారా ఆదుకునే యత్నం చేశాయి.


మరి ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో కాకపోయినా పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం నేరుగా పేదలకు కానీ.. లేదా రాష్ట్రాలకు ఆర్దిక సాయం చేయడం ద్వారా కానీ.. వారి జీవన స్థితిగతులు మార్చవచ్చు. కరోనా వచ్చిన వారిలో కేవలం 2 శాతం మాత్రం మంది మాత్రమే చనిపోతున్నారు. కానీ.. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది మరింత పేదలవుతున్నారు. పేదరికం కారమంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లలోని కరోనాకు గురై మరణించినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించడానికి డబ్బులు లేక వాటిని గంగా నదిలో తోసేస్తున్నారు.


ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకూ సెకండ్ వేవ్ విషయంలో ఘోరంగా విఫలమైన మోదీ.. ఇకనైనా ఒక నిర్దిష్ట కార్యాచరణ పధకం ద్వారా పేదలను ఆదుకోవాలి. లాక్ డౌన్, కర్ప్యూ వంటివాటి వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు సాయం చేయాలి. దేశంలో నగదు లభ్యత పెంచాలి. ప్రజల చేతుల్లో డబ్బు అందేలా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: