బ్యాడ్‌ న్యూస్‌లో గుడ్‌న్యూస్‌.. చికెన్‌ ప్రియులకు పండుగే..!?

మానవాళిపై వైరస్‌లు వరుసగా దాడి చేస్తున్నాయి. 2020 ఏడాది అంతా కరోనా మనుషులతో ఓ ఆట ఆడుకుంది.. ఏడాది పాటు చుక్కలు చూపించింది. అది తగ్గిందనుకునేలోపు ఇప్పుడు స్ట్రెయిన్ అంటూ మరో కరోనా వైరస్‌ భయపెడుతోంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు బర్డ్‌ ఫ్లూ అనే వ్యాధి వ్యాపిస్తోంది. క్రమంగా ఇండియా అంతటా పాకుతోంది. బర్డ్‌ ఫ్లూ వస్తే కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. వందలు, వేల సంఖ్యలో టపటపారాలిపోతాయి.

నిజంగా ఇది వెరీ బ్యాడ్ న్యూస్.. కానీ.. ఇందులోనూ చికెన్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. అయితే మన పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ కాస్త దూరంలో ఉన్న కేరళలోనూ బర్డ్‌ ఫ్లూ ఉంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే..  ఇక చికెన్‌ రేట్లు అమాంతం పడిపోతాయి. ఫ్రీగా ఇచ్చినా తినాలంటే జనం భయపడతారు. అందుకే పౌల్ట్రీ యజమానులు ముందుగా జాగ్రత్తపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్టాక్‌ మొత్తం తక్కువ రేటుకైనా సరే అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్న తెలుస్తోంది.

కాస్తో కూస్తో నష్టం వచ్చినా పర్వాలేదు.. బర్డ్ ఫ్లూ వస్తే మొదటికే మోసం వస్తుందన్న భయాందోళనలు పౌల్ట్రీ యజమానుల్లో కనిపిస్తున్నాయి. ఈ మేరకు చికెన్ ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. పాత వ్యాధే అయినా ఈ బర్డ్‌ ఫ్లూ ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలో ఈ వైరస్ సత్తా చాటింది. ఈ వైరస్‌ ధాటికి వేల సంఖ్యలో పక్షులు చనిపోతున్నాయి. ఈ వైరస్ తమ రాష్ట్రంలో విస్తరించకుండా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ పొరుగు రాష్ట్రాలు జాగ్రత్త పడుతున్నాయి.

ఇప్పటికే కేరళలోని అళప్పుజ, కొట్టాయం జిల్లాల్లో బర్ల్‌ప్లూ ఆనవాళ్లు గుర్తించిన అధికారులు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో కోళ్లు, బాతులు, ఇతరపక్షులను చంపేస్తున్నారు. భోపాల్‌లోని లాబోరేటరీ బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ధ్రువీకరించటంతో ఈ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: