పది మంది చస్తే చచ్చారు.. కానీ ఆ కులం డాక్టర్‌ను అరెస్టు చేస్తావా..? దమ్మున్న మీడియా వింత వాదన..?

విజయవాడలో కొన్ని రోజుల క్రితం స్వర్ణప్యాలస్‌లో రమేశ్ ఆసుపత్రి నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పది మంది వరకూ చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ఈ విచారణలో రమేశ్ ఆసుపత్రి అనేక నిబంధనలు ఉల్లంఘించినట్టు వార్తలు వస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించలేదని.. అనుమతులు లేకుండానే కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


కరోనా టెస్టులు చేయకుండానే ఎక్స్‌రేలు, ఈసీజీలు చేసి కరోనా ఉందని ఈ సెంటర్లలో చెబుతున్నారని.. అవసరం లేకపోయినా కరోనా వైద్యం చేస్తూ లక్షలు గుంజుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా రమేశ్ ఆసుపత్రి యజమాని రమేశ్ బాబు కోసం ప్రభుత్వం గాలిస్తోంది. ఆయనపై చర్యలకు ఉపక్రమిస్తోంది. అయితే సదరు రమేశ్ బాబు కమ్మ కులానికి చెందినవారు. అందులోనూ ఆయన టీడీపీకి సన్నిహితుడు.


చంద్రబాబు ఆ మధ్య నిర్వహించిన కరోనా జూమ్ సదస్సుల్లో పాల్గొన్ని ప్రభుత్వం విమర్శలు చేశారు.  విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవడాన్ని దమ్మున్న మీడియాగా చెప్పుకునే ఓ పత్రిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకు ఆ పత్రిక చేస్తున్న వాదన మరీ వింతగా ఉంది. స్వర్ణ ప్యాలస్‌లో ప్రమాదం జరిగితే.. దాన్ని నిర్వహించే రమేశ్ ఆసుపత్రికి సంబంధం ఉండదట. రమేశ్ ను అరెస్టు చేస్తే.. వైద్యులు బెదిరిపోయి రాష్ట్రానికి నష్టం జరుగుతుందట.


రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటే.. అది కులద్వేషంతో రగిలిపోవడమేనట. సీఎం జగన్ ఈ సమస్యను కుల కోణంలో చూస్తున్నారట. ఇదెక్కడి వింత వాదనో ఆ పత్రికకే తెలియాలి. అసలు ఇక్కడ రమేశ్ కులం సంగతి ఎందుకు.. నిర్లక్ష్యం కారణంగా పది మంది మంటల్లో కాలిపోతే.. ఆ ఆసుపత్రి యజమానిని అరెస్టు చేయకూడదా.. విచారించ కూడదా.. అసలు విచారణకు డాక్టర్ కులానికి ఏంటి సంబంధం..? తప్పుచేసిన వాడు ఫలానా కులం కాబట్టి వదిలేయాలా.. బాబోయ్.. నిందితుడు తమవాడైతే అడ్డంగా సమర్థించుకోవచ్చన్నమాట అంటూ ఆశ్చర్యపోతోంది పాత్రికేయలోకం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: