గ్లోబల్ సమిట్.. మొదటి రోజు రేవంత్ ఫుల్ బిజీబిజీ?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మొదటి రోజు డిసెంబర్ 8న మధ్యాహ్నం ఒంటి ముప్పై గంటలకు ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వేదికకు చేరుకుంటారు. వివిధ రంగాల స్టాళ్లను స్వయంగా తిలకిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతోపాటు తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం రూపొందించిన ప్రణాళికలను వివరిస్తారు.

ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించే విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిర్వహిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల దిగ్గజాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి వరుసగా దేశీయ, విదేశీ ప్రతినిధి బృందాలతో విడివిడి సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొంటారు. దాదాపు పదిహేను సమావేశాలతో ఆయన షెడ్యూల్ నిండిపోయింది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా, అమెజాన్, ఐకియా, టెక్స్‌టైల్, ఫర్నిచర్ రంగాల ఎంఎస్ఎంఈలు, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ ప్రతినిధులు, సిడ్బీ, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ అధికారులతో సీఎం చర్చలు జరుపుతారు. అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, యూనివర్సిటీ ఆఫ్ లండన్, వంతార, విన్‌గ్రూప్, వివిధ దేశాల రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రాత్రి ఏడు గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: