రాజమౌళి ప్లాన్ అంటే ఇదే వారణాసిలో మహేష్ బాబు అలా మెంటల్ ఎక్కించబోతున్నాడా..?
ఈ సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలిసినప్పటి నుండి, మహేష్ బాబు పాత్రపై ప్రత్యేకంగా దృష్టి పడింది. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్, మిస్టరీ, అడ్వెంచర్ మిశ్రమంగా రూపొందుతుందని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. మునుపెన్నడూ చూడని లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో మహేష్ బాబు అలరిస్తాడని పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఈ కథ కోసం సూపర్‌స్టార్ ఫిజికల్‌గా చేసిన హార్డ్ ట్రైనింగ్ కూడా ఇప్పుడు చర్చలో ఉంది.
మహేష్ బాబు ఎప్పటినుంచో రన్నింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆయన డైలీ వర్కౌట్‌లో గంటసేపు పరిగెత్తడం తప్పనిసరి. ఆరోగ్యం, బాడీ షేప్ మాత్రమే కాదు, ముఖానికి వచ్చే షైన్ కూడా రన్నింగ్ వల్లనే అంటారు. అందుకే చాలా మంది అభిమానులు మహేష్‌ని చూసినప్పుడు ఆయన అందం సీక్రెట్ ఏమిటని ప్రశ్నిస్తే, ఆయన చెప్పే మొదటి లైన్ “రన్నింగ్” అంటారు.మహేష్ రన్నింగ్ ఒక ప్రత్యేకమైన స్టైల్‌తో ఉంటుంది. అతని లాంగ్ స్ట్రైడ్స్, సమాన రిథమ్, స్పీడ్ మేనేజ్‌మెంట్ అన్నీ కలిపి చూస్తే, అదే అతని స్క్రీన్‌పై ఉన్న గ్రేస్‌కు కారణమవుతుంది. ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది స్టార్ హీరోల్లో అలాంటి రన్నింగ్ స్టైల్ కనిపించడం చాలా అరుదు.
ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా నటించిన యాక్షన్ సినిమాల్లో ఎన్నో ఛేజింగ్ సన్నివేశాలు ఉన్నా… వారి రన్నింగ్‌కు వచ్చిన రెస్పాన్స్ మహేష్ పొందినంతగా రాలేదు. అభిమానులు మాత్రమే కాదు, ఫిల్మ్ మేకర్స్ కూడా మహేష్ బాబు రన్నింగ్ స్టైల్‌ను ప్రత్యేకంగా గుర్తించడం చాలా సార్లు చూశాం.తాజాగా సోషల్ మీడియాలో మహేష్ రన్నింగ్‌ను ప్రపంచ ప్రసిద్ధ స్ప్రింటర్, ఒలింపిక్ చాంపియన్ “ఉసేన్ బోల్ట్”తో పోల్చుతున్నారు. మహేష్ పరిగెత్తే తీరు, స్టెప్ ప్లేస్‌మెంట్, బాడీ బ్యాలెన్స్ చూస్తే… అవే క్వాలిటీలు బోల్ట్‌లో ఉన్నాయనే ఊహాగానాలు అభిమానుల మధ్య ట్రెండ్ అవుతున్నాయి. జమైకా చిరుతపులి బోల్ట్ వలే స్క్రీన్‌పై మహేష్ వేగంగా పరిగెత్తుతున్న వీడియోలు ఇప్పుడు ఫ్యాన్ పేజీల్లో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి చిత్రాల్లో యాక్షన్ కెరియర్ హైలైట్ అవుతుందని తెలిసిందే. బాహుబలి, ఈగ, ఆర్ఆర్ఆర్ లో చూపించిన యాక్షన్ వైశాల్యం చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది అడ్వెంచర్ థీమ్‌లో వస్తున్న ఎస్.ఎంబీ 29లో మహేష్ ఒక అన్వేషకుడి పాత్రలో కనిపిస్తాడన్న సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అడవులు, గుహలు, ప్రమాదకర పరిస్థితుల్లో జరిగే యాక్షన్ సన్నివేశాల్లో మహేష్ రన్నింగ్ అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.ముఖ్యంగా జంగిల్ సీక్వెన్సుల్లో వేటాడే సన్నివేశాలు, ప్రాణాలతో కాపాడుకునే చేజింగ్ సీన్స్ చాలా ఉండబోతున్నాయని టాక్.