ట్రోలింగ్ పై.. దిమ్మతిరిగేలా సమాధానం చెప్పిన సీరియల్ బ్యూటీ..!
ప్రస్తుతం తాను కొత్త సీరియల్స్ చేయలేకపోతున్నానని ఈవెంట్స్, టీవీ షోలలో మాత్రమే పాల్గొంటున్నట్టుగా తెలియజేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తన తోటి నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక ఇద్దరు కలిసి ప్రస్తుతం లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే గడిచిన కొద్ది రోజుల క్రితం డాన్స్ ఐకాన్ 2 లో పాల్గొన్న ప్రియాంక ఈమె వేసుకున్న దుస్తులపైన చాలామంది తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.
ఈ విషయం పైన మాట్లాడుతూ ట్రోల్స్ చూసి నేను షాక్ అయ్యాను.. ప్రపంచం మొత్తం నా మీదే మాట్లాడుతోందా అన్నట్లుగా కామెంట్స్ చేసింది. నేను నటించిన క్యారెక్టర్స్ ఉన్నంతవరకు తాను ఆ లుక్ లో ఉంటాను, ఆ తర్వాత నాకు ఫ్రీడమ్ ఉంది. కాబట్టి నాకు నచ్చిన దుస్తులు వేసుకోవడంలో తప్పేమీ లేదు.. నా ఇష్టం తో వేసుకున్న బట్టలు..మీకేంటి నొప్పి అంటూ మాట్లాడింది. అయితే కొన్ని కామెంట్స్ చాలా దారుణంగా భరించలేనంతగా ఉన్నాయి. అవి చూసి నాకే అసహ్యం వేసిందని , అలాంటి సమయంలో తన ప్రియుడు శివకుమార్ తనకి అండగా ఉన్నారంటూ తెలిపింది. నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే అన్ ఫాలో చేయండి కానీ ఇలా కామెంట్స్ చేయడం మంచిది కాదని తెలిపింది ప్రియాంక జైన్.