ఇబ్బందులు పడుతున్న వారిపై కరోనా వైరస్ సమస్య ఏ స్ధాయిలో ప్రభావం చూపుతుందనేందుకు ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో మరణాలే ఉదాహరణ. ఇందుకు మనదేశం కూడా అతీతమేమీ కాదన్న విషయం ఇప్పటికే రుజువైంది. దాంతో పైన చెప్పిన క్యాటగిరీల్లోని కోట్లాదిమంది గడచిన నాలుగు నెలలుగా ఇళ్ళకే యావత్ ప్రపంచం కరోనా వైరస్ అంటే వణికిపోతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతరత్రా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న వారిపై వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోందని ప్రపంచంలో ఇప్పటికే రుజువైంది కూడా. వృద్ధులు, అప్పటికే అనారోగ్యంతో పరిమితమైపోయారు. అయినా కొందరిని కరోనా వైరస్ వదిలిపెట్టలేదు.
ఇలాంటి నేపధ్యంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయంలో అర్చకులకు కూడా కరోనా వైరస్ సోకింది. పెద్ద జియ్యర్ తో పాటు మరో 20 మందికి అర్చకులకు వైరస్ సోకిందని నిర్ధారణయ్యింది. దాంతో మిగిలిన వాళ్ళలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ సమయంలోనే శ్రీవారి కైంకర్యాలలో కీలకంగా వ్యవహరిస్తున్న రమణదీక్షితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాడు. దర్శనాలకు వెంటనే నిలిపేయాలంటూ చేసిన డిమాండ్ ప్రభుత్వం+టిటిడిలో సంచలనమైంది. ప్రపంచంలోని నలుమూలల నుండి భక్తులు దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. వైరస్ కారణంగా చరిత్రలోనే మొదటిసారిగా మూడు నెలలపాటు శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు దూరమైంది. మళ్ళీ ఇపుడిపుడే స్వామివారిని దర్శించుకునేందుకు టిటిడి ట్రస్టుబోర్డు షరతులతో భక్తులను తిరుమలపైకి అనుమతిస్తోంది.
65 ఏళ్ళు దాటిన వాళ్ళని, 10 ఏళ్ళలోపు పిల్లలను దర్శనానికి అనుమతించేది లేదని టిటిడి స్పష్టంగా ప్రకటించింది. దీని ప్రకారమే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న టిటిడి, మరి స్వామిసేవల్లో పాల్గొనే వాళ్ళ విషయంలో మాత్రం నిబంధనలు ఎందుకు పాటించటం లేదన్న విషయంలోనే చర్చ పెరిగిపోతోంది. ఆలయ గౌరవ ప్రధానార్చకుడు అర్చకం రమణదీక్షితులు, ఆలయ ఓఎస్డీ డాలర్ల శేషాద్రి తదితరుల వయస్సులు 65, 70 పైనే ఉంటుందని సమాచారం. ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరిగేటపుడు, ప్రధాన ఉత్సవాల సమయంలో వీళ్ళందరు తప్పనిసరిగా పాల్గొంటుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. వయసు మీదపడిన అర్చకులు చాలామందే ఉన్నా దర్శనాలను నిలిపేసే విషయాన్ని మాత్రం టిటిడి పట్టించుకోవటం లేదు.
శ్రీవారి కైంకర్యాల విషయంలో ఇంతటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న అనేకమందికి కరోనా వైరస్ సోకినా టిటిడికి చీమకుట్టినట్లు కూడా లేదు. పైగా భక్తుల ద్వారా ఎవరికీ వైరస్ సోకలేదనే వితండవాదం చేస్తోంది. స్వామివారి కైంకర్యాల్లో పాల్గొనే వీళ్ళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమన్న విషయాన్ని టిటిడి మరచిపోయినట్లుంది. స్వామివారి దర్శనం కోసం ప్రతిరోజు తిరుమలకు వస్తున్న వేలాది మందిలో ఎవరి ద్వారానో శ్రీవారి సేవల్లో పాల్గొనే వాళ్ళలో అర్చకులకు వైరస్ సోకిందన్నది వాస్తవం. తిరుమలను లాక్ డౌన్ చేసి మళ్ళీ తెరిచిన తర్వాత టిటిడి ఉద్యోగుల్లో సుమారు 180 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన ఉద్యోగుల్లో తిరుమల ఆలయంలో డ్యూటి చేసిన వారు కూడా ఉన్నారు.
అర్చకుల్లో 18 మందికి వైరస్ సోకిందంటే మిగిలిన వాళ్ళకూ వైరస్ సోకుతుందనటంలో సందేహం లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళ విషయం ఎలాగున్నా అర్చకుల్లో కీలకమైన రమణదీక్షితులు, శేషాద్రి లాంటి వయస్సయిపోయిన వాళ్ళని స్వామివారి సేవలకు కొంతకాలం దూరంగా ఉంచితేనే మంచిది. ఆలయంలో పనిచేస్తున్న మిగిలిన అర్చకులందరికీ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే వైరస్ సోకిన వాళ్ళని తిరుపతిలోని స్విమ్స్ కు కాకుండా చెన్నైకి ఎందుకు తీసుకెళ్ళారో అర్ధం కావటం లేదు. సో, పరిస్దితులను గమనిస్తుంటే మళ్ళీ శ్రీవారి దర్శనాలకు కొంతకాలం బ్రేక పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఎప్పుడు ప్రకటిస్తారో.
మరింత సమాచారం తెలుసుకోండి: