ఇండియా.. పీవోకే ఆక్రమించడానికి ఇదే సరైన సమయమా?

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆక్రమించుకోవాలంటే ఇండియాకు ఇది సరైన సమయం. ప్రస్తుతం పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. అప్పులు పెరిగిపోయాయి. ఎలా తీర్చాలో తెలియడం లేదు. దీనికి తోడు పాక్ లో అంతర్గంత కొట్లాటలు జరుగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అల్లర్లు జరుగుతున్నాయి. ఆర్థికంగా దిగజారిపోయింది. పాక్ దగ్గర ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒక్క నెలకు సరిపడ మాత్రమే ఉన్నాయి. ఐఎంఎఫ్ లోన్లు ఇవ్వడం లేదు. అమెరికా, యూరప్ దేశాల ఒత్తిడి వల్ల ఎఫ్ఎంటీఎఫ్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఐఎంఎఫ్ లోన్లు ఇవ్వడం లేదు.

ఎవరైనా షూరిటీ ఇస్తేనే అప్పులు ఇస్తామని చెబుతున్నారు. చైనా, సౌదీ అరేబియా, ఖతర్ లాంటి దేశాలు ఘూరిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. కనీసం పెట్రోల్, డిజీల్ కొట్టియ్యాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి. చైనా అప్పులు ఇచ్చినా దానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా తీసుకుంటుంది. లీటర్ పెట్రోల్ ధర రూ.267 గా ఉంది. దీంతో ఏమీ చేయలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. పీవోకే గనక అక్యూపై చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒక వేళ ఇండియా గనక యుద్దం చేయడానికి వస్తే అందరూ ఒకటై మళ్లీ ఇబ్బందులు వస్తాయేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. చైనా గనక పాక్ కు సపోర్టు చేస్తే దాని నుంచి ఇండియా ఎలా ప్రతిఘటించాలి. తదితర వివరాలు అన్ని ముందుగానే పసిగట్టాల్సి ఉంటుంది. ఇండియా గనక దాడి చేస్తే కచ్చితంగా అన్ని విడిచిపెట్టి ఇక్కడే పాక్ తన దృష్టిని సారిస్తుంది. యుద్దం చేయాలా వద్దా అనే నిర్ణయం చాలా చాకచక్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క సారి యుద్ధ రంగంలోకి దిగితే మాత్రం వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. భారత్ అన్ని విధాలుగా ఆలోచించి పీవోకే స్వాధీనం చేసుకోవడమా.. లేక మరిన్ని రోజులు వేచి ఉండటమా చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pok

సంబంధిత వార్తలు: