కర్ణాటక ఫలితాలపై బీజేపీ మీడియా షాకింగ్‌ రిపోర్ట్‌?

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఎక్కువ సంస్థలు చేసిన సర్వేలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తేల్చి చెబుతున్నాయి. కొన్ని జేడీఎస్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉందని సీచెబుతున్నారు. రిపబ్లిక్ లాంటి బీజేపీ అనుకూల మీడియా సంస్థే బీజేపీ ఓడిపోతుందని తక్కువ సీట్లు వస్తాయని చెప్పడం కొసమెరుపు.  అయితే ఏయే సర్వే సంస్థలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాయంటే...

సీఓటర్ సంస్థ కాంగ్రెస్ 100 -112, బీజేపీ 83-93 జేడీఎస్ కు 21-29వరకు వస్తాయని అంచనా వేసింది. సువర్ణ న్యూస్ సంస్థ 91- 106, కాంగ్రెస్ కు, బీజేపీకి 94 నుంచి 116 సీట్లు వస్తాయని చెప్పింది సువర్ణ న్యూస్ సంస్థ బీజేపీ అధికారం చేపట్టనుందని చెప్పింది.  జేడీఎస్ కు 14 నుంచి 26 వస్తాయని చెప్పింది. ఫోల్స్ స్టార్ట్ సంస్థ 98 నుంచి 104 కాంగ్రెస్ కు వస్తాయని చెప్పింది.

బీజేపీకి 88 నుంచి 98, జేడీఎస్ కు 26 వరకు సీట్లు గెలుస్తుందని చెప్పింది. సౌత్ పస్ట్ సంస్థ 75 నుంచి 80 బీజేపీ, 90 నుంచి 110 కాంగ్రెస్, జేడీఎస్ కు 25 -30 వస్తాయని తెలిపింది.కేవలం సువర్ణ అనే మీడియా చేసిన సర్వేలో బీజేపీ గెలుస్తుందని తెలిసింది. అసలైన కథ రేపు  ఓటింగ్ లెక్కింపు రోజు తేలనుంది.  లెక్కింపు పూర్తయ్యే వరకు ఏ పార్టీకి మద్దతు రాకపోతే జేడీఎస్ మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రెండున్నరేళ్లు సీఎం పదవి అనుభవించాక.. వారికి కుమార స్వామి షాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు హంగ్ వస్తే జేడీఎస్ కుమార స్వామే కింగ్ మేకర్ అవనున్నారు. రేపు లెక్కింపులో ఎన్ని డ్రామాలు జరగనున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: