మణిపూర్‌ గొడవల వెనుక చైనా హస్తం?

కెనడాలో ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని గతంలో ప్రచారం జరిగింది. దీంతో కెనడా చైనా రాయబారిని బహిష్కరించింది. చైనా కూడా కెనడా రాయబారిని బహిష్కరించింది. ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా జరిగింది. ఆస్ట్రేలియాలో సుమారు 1.4 మిలియన్ల చైనా ప్రజలు నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా జనాభాలో 5 శాతం చైనీయులు ఉంటున్నారు. వాళ్లని కల్చరల్ ఔట్ రీచ్ గ్రూపు ద్వారా ప్రభావం చూపాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.  కెనడా జనాభా మొత్తంలో దాదాపు అయిదు శాతం వరకు చైనీయులు ఉంటారు.

చివరకు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోను వెనక ఉండి నడిపించినట్లు చర్చ నడిచింది. ట్రూడో అందుకే చైనా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి. మైకెల్ చాంగ్ వ్యక్తి  కెనడాలో చైనా చెప్పినట్లు వినలేదని ఆయన్ను  జైల్లో పెట్టింది. ఆస్ట్రేలియా  ఎన్నికల్లో కూడా డ్రాగన్ కంట్రీ  జోక్యం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఎన్నికల్లో వివిధ పార్టీలకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫండింగ్ అందజేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మరో వివాదంలో తల దూర్చినట్లు చైనా పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మణిపూర్ అల్లర్ల వెనక చైనా కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తోంది. మణిపూర్ లో అల్లర్లు చేసే వారికి చైనా ఫండింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనా  ప్రతి దేశంలో తన ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అమెరికాను కాదని కేవలం చైనానే కింగ్ అని నిరూపించుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లో అనేక అల్లర్లకు దిగుతోంది. ప్రస్తుతం ఇండియాలో కూడా విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేసిందంటే ఎంతకీ దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. తైవాన్, ఫిలిఫీన్స్, ఇండియా, ఆస్ట్రేలియాపై ఆధిపత్యం అంటూ అందరిపై ఎదురు దాడికి దిగుతోంది. ఇండియాకు ప్రధాన శత్రువు పాక్ కంటే చైనా నే అని తెలుసుకోవాలి. చైనా పట్ల ఇండియా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇండియా లో వచ్చే ఎన్నికల్లో చైనా ప్రభావం కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: