ఉక్రెయిన్‌ శోకం.. అమెరికాదే పాపం?

ఉక్రెయిన్ ప్రజల్ని రష్యా చంపేస్తుంది. ఉక్రెయిన్ కి సంబంధించిన బిల్డింగులను ధ్వంసం చేసేస్తుంది సివిలియన్స్ అందరూ ఈ దాడుల వల్ల చనిపోతున్నారు. దీనికి అంతటికీ రష్యా కారణం కాబట్టి రష్యాను యుద్ద నేరం కింద అరెస్టు చేయాలి. పుతిన్ ని జైల్లో వేయాలి, ఉరితీయాలి అంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉక్రెయిన్ మాటలకు రష్యా స్పందిస్తూ ఉక్రెయిన్ ని ఏమీ అనకపోవడం ఇక్కడ విచిత్రం.

అయితే ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ కి ఆయుధాలు ఇస్తున్న అమెరికాని అంటున్నట్లుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ వెనకాల ఉన్న అమెరికాపై యుద్ధ చర్యలు తీసుకోమని రష్యా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డొనేట్ స్కీ, లోపాన్ స్కీ, జెపోరీజియా, కేర్సన్ ఈ ప్రాంతాలన్నిటిని మాక్సిమం రష్యా ఆక్రమించేసింది. ఒక 10 నుండి 30% వరకు మాత్రమే ఇప్పుడు ఉక్రెయిన్ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అందులోనూ ఒక 40% మాత్రమే ఇప్పుడు ఉక్రెయిన్ కు అక్కడ ప్రజలు మద్దతుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రష్యాకు మద్దతు పలికే డొనేట్ స్కీ ప్రాంతంలోని, ఒక  బస్సు పై ఉక్రెయిన్ కి సంబంధించిన మిసైల్ పడడంతో ఆ బస్సులో ఉన్న పిల్లలు చనిపోయారు. అయితే దీనికి కారణం ఉక్రెయిన్ కాదని,  ఆయుధాలు సప్లై చేసిన అమెరికా అని రష్యా ఇప్పుడు అమెరికాపై ఆరోపణ చేస్తుంది. అమెరికాపై తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంది.

ఇప్పుడు డొనేట్ స్కీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉక్రెయిన్ వే. ఇప్పుడు రష్యా వాటిని ఆక్రమించుకుంది కాబట్టి స్కూళ్లు, హాస్పటళ్ళు ఇలా ప్రతి దాని మీద ఉక్రెయిన్ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రష్యాని ధ్వంసం చేస్తున్నామనే ఫీలింగ్ లో రష్యా ఆధీనంలో ఉన్న డొనేట్ స్కీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుంది ఉక్రెయిన్. అంటే ఉక్రెయిన్ గతంలో తన స్వాధీనంలో ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు శత్రు స్థానంగా భావించి దాడులు చేయడం మొదలుపెట్టిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: