హెచ్చరిక: ఇవి కచ్చితంగా జగన్‌కు మైనస్‌ అవుతాయా?

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అనంతపురం జిల్లాలోని నార్పల ప్రాంతంలోని సభ అయిపోయిన తర్వాత వెళ్లిపోయేటప్పుడు హెలికాప్టర్ సమస్య వచ్చి అకస్మాత్తుగా బై రోడ్డు వెళ్లాల్సి వచ్చిన సందర్భం వచ్చింది. ఆయన వస్తున్నారని ఆకస్మాత్తుగా తెలిసినా కూడా అక్కడ వేల మంది జనాభా ఆయనకి ఎదురెళ్ళి పూలతో ఘనంగా స్వాగతం పలికారు అప్పుడు. అయితే అక్కడ జరిగిన ఒక సంచలమైన విషయం ఏంటంటే అక్కడ సత్యసాయి దగ్గర రైతులు సీఎం కాన్వాయ్ కి అడ్డుగా రావడం అయితే జరిగింది. ఆయనకి అక్కడ గట్టి నిరసన అయితే తగలడం జరిగిందని తెలిసిందే.

ఇంటి స్థలాల కోసం ఇచ్చిన భూములకు పరిహారం చెల్లించలేదని ఆ రైతులు అక్కడ అడ్డంగా నిలబడి నిరసనకు దిగారు అన్నట్లుగా తెలుస్తుంది. ఒక 30-40 మంది రైతులు కాన్వాయ్ కి అడ్డంగా నిలిచినా, కాన్వాయ్ ఏదోరకంగా ముందుకు వెళ్లిపోయిందని చెప్తున్నారు. కానీ కొంతమంది అంటుంది ఏంటంటే, ఇలా రైతులు కాన్వాయ్ కి అడ్డం వచ్చినప్పుడైనా సరే కాన్వాయ్ ని ఒక్క నిమిషం ఆపి వాళ్ళ బాధలు ఏంటో విని వాళ్ళ వినతి పత్రాన్ని తీసుకుంటే బాధ్యతగా ఉండేదని, ఒకవేళ సెక్యూరిటీ ప్రాబ్లెమ్ అని చెప్తున్నా కూడా పోనీ తర్వాత అయినా సరే అక్కడికి ఒక టీం ను పంపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని విని దానికి సొల్యూషన్ చూపించే మార్గాన్ని ఆలోచించాల్సిందని వాళ్లు అంటున్నారు.

అయితే వాళ్లు కేతిరెడ్డిపాడు విషయంలో నిరసన వ్యక్తం చేసి ఉండొచ్చని, అటుగా జగన్ వస్తున్నారని తెలిసి జెసి వాళ్లు ఈ రకంగా రైతులను నిరసనకు దిగమని పంపించారన్నట్లుగా అక్కడ జరిగిందంతా వాళ్ళ ప్లాన్ అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అయితే వాళ్లు అనేది ఏంటంటే అలా ఆ రైతులకు నిజంగానే పరిహారం అందలేదా, లేదంటే ఇదేమైనా ప్లానా, ఒకవేళ నిజంగా ఆ రైతులకి పరిహారం అందకపోతే మాత్రం ప్రభుత్వం దాని గురించి ఆలోచించాలని వాళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: