కర్ణాటక ఎఫెక్ట్‌ చంద్రబాబును సీఎం చేస్తుందా?

ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని టీడీపీ అంచనా వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టేలా లేదని చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీ  సౌత్ ఇండియాలో ఈ రెండు ప్రాంతాల్లో దెబ్బతింటే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలే అవసరానికి వస్తాయని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తోంది. దీని కోసం కేంద్రంలో బలంగా ఉండే పార్టీ అయినా బీజేపీని కలుపుకుపోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ బీజేపీ అధిష్టానం నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. చంద్రబాబు గతంలో బీజేపీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత వరకు చేసేశారు. ప్రతిపక్షం అయినా వైసీపీని కాకుండా బీజేపీని టార్గెట్ చేసి ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించారు. అంతే కాదు బీజేపీని కాదని కాంగ్రెస్ తో పొత్తు కూడా పెట్టుకున్నారు.

ఈ సమయంలో సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురైంది. అయినా చంద్రబాబు గతసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను కలుపుకుని పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారం కోల్పోయి కేవలం 23 స్థానాలకే పరిమితమయ్యారు. కాబట్టి ప్రస్తుతం బీజేపీని ఎలాగైనా కలుపుకుంటేనే బాగుంటుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.  దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీల్లో బీజేపీ ప్రథమ స్థానంలో ఉంది.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే దాదాపు 10 ఎమ్మెల్యే స్థానాలకు వారికి టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అటు జనసేనతో పొత్తు కుదిరితే వారికి ఒక 25 స్థానాల వరకు ఇవ్వాలి. ఇంకా కమ్యూనిస్టులను కూడా కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కు బీజేపీతో పొత్తు కుదరి మంచి స్థానాల్లో గెలిస్తే కేంద్రంలో కూడా దక్షిణ భారత దేశం నుంచి ప్రముఖ పాత్ర పోషించవచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: