బాబు భజన చేస్తున్నా.. మోడీ సైలెంట్‌.. ఎందుకంటే?

మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ సదస్సులో పాల్గొన్నారు. అయితే అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రిపబ్లిక్ టీవీ సదస్సులో పాల్గొన్నారు. అలాగే ఆ సందర్భంలో ఎన్డీఏకి తమ అనుకూలతను చూపించారు. నరేంద్ర మోడీతో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని కోరుకోవడం ఇదంతా ప్రజలందరూ చూశారు. అయితే నరేంద్ర మోడీ మాత్రం ఈ విషయాలు ఏమీ ప్రస్తావించకుండా , దేశంలోని వ్యవస్థను పారదర్శకంగా మార్చుతున్నందుకు అవినీతిపరులు అంతా తనని వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

వారసత్వవాదులు కలిసి ఎంత పెద్ద కూటమి కట్టినా వెనక్కి తగ్గబోనని ఆయన స్పష్టం చేశారు. అవినీతి ఇంకా కుటుంబ పాలన నుండి దేశాన్ని రక్షించడానికి తాను బయలుదేరానని ఆయన చెప్పుకొచ్చారు. లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేయడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలను నిరాటంకంగా అందేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానితో కమిషన్లు, లీకేజీలు బంద్ అయ్యాయి.

డజన్ల కొద్ది కార్యక్రమాల్లో ఇదే తరహా  పారదర్శకత వచ్చింది. ప్రభుత్వ అవసరాల కోసం చేసే కొనుగోలులో ఇదివరకు చాలా అవినీతి జరిగేది. ఇప్పుడు దాన్ని మార్చేసి గవర్నమెంట్ పోర్టల్స్ ద్వారా జరుపుతున్నాం. పన్ను అధికారులు, పన్ను చెల్లింపు దారులు పరస్పరం తారసపడే అవకాశం లేకుండా చేసాం. జీఎస్టీ ని తీసుకువచ్చి నల్లదన అర్జన అడ్డుకున్నాం. ఇలా జవాబుదారీతనంతో పని చేసేటప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగడం సహజం. అందుకనే అట్లాంటి అవినీతి ప్రతినిధులు అంతా ఆందోళనలు చేస్తున్నారు.

జవాబు దారి వ్యవస్థను ధ్వంసం చేయాలనుకుంటున్నారు. అవినీతి నిర్మూలన పనిని మేము సగం సగం చేసుకోవడం లేదు, సమగ్రంగా చేసుకుంటూ వస్తున్నాం. అందునల్ల అక్రమార్జన ఆగిపోయిన వాళ్ళు నాపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. కలాల్లో కూడా విషం నింపుకుని ప్రచారం చేస్తున్నారంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. అయితే ఎన్ని చెప్పినా ఆయన చంద్రబాబునాయుడు గారికి కావాల్సిన పొత్తుల గురించి మాత్రం మాట్లాడకపోవడం ఇక్కడ విచిత్రం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: