జగన్.. ఈ విషయం గట్టిగా ఆలోచించాల్సిందే?

ప్రస్తుత విద్యా విధానంలో వచ్చిన మార్పు కారణంగా విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారు. గతంలో ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఇలా ఒక రకమైన విద్యా విధానంతో చదువులు సాగేవి. ఏడు, పది తరగతుల్లో బోర్డు ఏగ్జామ్స్ నిర్వహించే వారు. దీని అనంతరం ఇంటర్ కు గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి. ఇలా ఒక పద్ధతి ప్రకారం కొనసాగేది. కానీ నూతన విద్యా విధానం అమలులోకి వచ్చాక 10 ప్లస్ 2 ఇంటర్ కూడా అదే స్కూల్ లో చదవాలి. దీని కోసం ప్రత్యేక స్టాప్ అవసరమవుతుంది. ఇంటర్ క్లాసులు చెప్పడానికి లెక్చరర్స్ అవసరం. స్కూల్స్ లోనే విద్యార్థులకు టీచర్ల కొరత ఉన్న సమయంలో ఇంటర్ విద్యార్థులకు లెక్చరర్స్ కొరత ఉంటుందనే విషయం గ్రహించకపోవడం పొరపాటే. ఇంటర్ విద్యార్థుల కోసం లెక్చరర్స్ ఉండాలి. సబ్జెక్టుల వారీగా వివరించే నిపుణులు అవసరం.

వీరు కావాల్సినంత మంది లేకపోవడంతో ఇంటర్ లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. కాబట్టి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం కనీసం వారికి సరిగా చదువు చెప్పించని పరిస్థితిలో ఉండటం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తారని చెబుతున్నారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల మనో వేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. కొత్తగా ప్రవేశపెట్టిన గవర్నమెంట్ స్కూల్స్ లో నే చదువుతున్న ఇంటర్ పస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మంచి బోధన అందేలా తయారు చేయాలి. ఇలా చేసినపుడు విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే ప్రభుత్వం విద్యా సంస్థల మీద విశ్వాసం కోల్పోతారు.  తద్వారా ప్రైవేటు విద్యాసంస్థల్లో లక్షలకు లక్షలు పోసి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: