మోడీ ప్రాపకం కోసం చంద్రబాబు తిప్పలే తిప్పలు?

రిపబ్లిక్ టీవీ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో ఇటీవల ప్రత్యేకంగా ఒక సమ్మిట్ నిర్వహించింది. దీని వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి కి బీజేపీ మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న ప్రముఖ వ్యక్తులను సదస్సుకు ఇన్వైట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం జగన్ ని కాకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబును పిలిచింది. ఈ సందర్బంగా చంద్రబాబు తన స్పీచ్ ను వినిపించారు. జాతీయ మీడియా కూడా రెండుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. టైమ్స్ నౌ ఈ మధ్య ఒక సర్వేను బయటపెట్టింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో 24 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పింది. టీడీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది ఫేక్ సర్వే అని కొట్టి పారేసింది.

జాతీయ మీడియా అయిన రిపబ్లిక్ టీవీ చంద్రబాబును సమ్మిట్ కు ఇన్వైట్ చేయడం, అక్కడ ప్రసంగం చేయమని అడగడం కొత్త చర్చలకు దారి తీసింది. గత ఎన్నికల్లో బీజేపీతో విబేధించి కాంగ్రెస్ తో  జతకట్టిన చంద్రబాబు కు ప్రజలు 23 సీట్లతోనే సరిపెట్టారు. అంతకుముందు బీజేపీతో రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మధ్యలో తెగదెంపులు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు రిపబ్లిక్ టీవీ ద్వారా బీజేపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన కూడా ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం, ఇతర పార్టీ నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు.

2019 ఎన్నికల సమయంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఇతర ఇండిపెండెంట్లు అందరూ వైసీపీ ముందు చతికిల బడిపోయారు. ఒక వేళ బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని బాబు నమ్ముతున్నారా.. వారి అవసరం రాష్ట్రానికి ఉంటుందని భావిస్తున్నారా...  రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేంద్రంతో  మంచి సంబంధాలు ఉంటే ప్రయోజనం కలుగుతుందనే అనుకుంటున్నారా.. ఏమైనా మళ్లీ బీజేపీకి దగ్గర కావాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: