ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు ఓకే.. మరి వారు విడిపోతే?

సుప్రీం కోర్టులో స్వలింగ సంపర్కం వివాహాలపై తీవ్రమైన వాదనలే నడుస్తున్నాయి. ఆడ ఆడ, మగ, మగ పెళ్లిచేసుకోవడంలో ఉన్న తప్పేంటి అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. భర్త, భార్య, ఆడ, మగ పెళ్లి చేసుకోని జీవించే జీవన విధానం ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది.

హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అందరి జీవితాల్లో నూ ఇదే విధానం కొనసాగుతోంది. అయితే సృష్టికి విరుద్ధంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఇద్దరు ఒకే జెండర్ కు చెందిన వారు వివాహం చేసుకుంటే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి చట్టాలు లేవు. రాజ్యాంగ సవరణలు చేసి వాటికి సంబంధించిన వివరాలతో చట్టం చేయాల్సి ఉంటుంది.

భర్త చనిపోతే నామినీగా భార్య పేరు ఉంటుంది. ప్రస్తుతం ఇద్దరు మగవారు పెళ్లి చేసుకుంటే నామినీగా ఎవరూ ఉంటారు. ఒక వేళ పెళ్లి చేసుకుని విడిపోతే వారి పరిస్థితి ఏమిటి? ఆడ, మగ జననేంద్రియాలను బట్టి జెండర్ లుగా విభజిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ట్రాన్స్ జెండర్లుగా కొంత మంది మారుతున్నారు. ఇద్దరు ఒకే జెండర్ కు చెందిన వారు పిల్లలను దత్తత తీసుకుంటే ఆ విషయంలో తల్లిగా పేరు రాస్తారా.. తండ్రిగా రాస్తారా.. ఏ విధంగా రాస్తారు. ఇలాంటి ఎన్నో చిక్కుముడుల ప్రశ్నలు కేంద్రం ముందు ఉన్నాయి.

దీంతో కేంద్రం కూడా రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవాలని సుప్రీం కోర్టుకు చెప్పింది. మరి దీనిపై ఎలాంటి చట్టాలు అవరసమవుతాయి. ఈ పెళ్లిళ్లకు సుప్రీం గనక ఓకే చేస్తే వివాహ చట్టంలో ఎలాంటి మార్పులు చేయాల్సి వస్తుంది. దీని వల్ల రాబోయే తరాలకు లాభ, నష్టాలు ఏమిటి. తదితర వివరాలు కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఎక్కడ కూడా ఈ విషయంలో రాజీ పడకుండా దేశ భవిష్యత్తు  దెబ్బతినకుండా కేంద్రం ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: