కేసీఆర్‌.. ఇఫ్తార్‌ విందుకెళ్తారు.. భద్రాచలానికి వెళ్లరా?

విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని.. సింగరేణి అధికారులను ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి వైజాగ్ పంపించారు సరే.. మరి తెలంగాణ పరిశ్రమల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. మంత్రులు కూడా స్టీల్ ప్లాంట్ అంశంపై అనేక ప్రకటనలు చేశారని.. కానీ.. సింగరేణిలో పని చేసే కార్మికులు అసంతృప్తితో ఉన్నారని.. ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వస్టే భారాస నిరసనలు చేపట్టిందని.. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందంటు భారాస నిరసనలు చేపట్టారని.. బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కేసీఆర్ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి భారాస పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.. ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా కేసీఆర్ చెప్పాలని తెలంగాణ బీజేపీ నిలదీస్తోంది.వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారని.. తొమ్మిదేళ్లు అవుతున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని.. ఇది ఎంత వరకు సమంజసమో కల్వకుంట్ల కుటుంబం చెప్పాలని.. కేసీఆర్ వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.

తొమ్మిదేళ్ల తరువాత కేసీఆర్ నిద్ర మేలుకొని అంబేడ్కర్ జయంతి రోజు నివాళులు అర్పించారని.. రాజకీయ ఎత్తుగడే తప్పా కేసీఆర్ కు అంబేడ్కర్ పై గౌరవం లేదని.. భద్రాచలం సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తిలోదకాలు ఇచ్చారని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించారు. దళిత బందు కాస్త భారాస బందు అయ్యిందని.. ముఖ్యమంత్రికి ఇప్తార్ విందుకు వెళ్ళడానికి సమయం ఉంటుంది తప్పితే భద్రాచలానికి మాత్రం రారని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: