శ్రీలంక కోతులు చైనాకు ఎగుమతి.. ఎందుకంటే?

శ్రీలంక నుండి చైనాకి కోతుల ఎగుమతి అనేటువంటి విషయం ఇప్పుడు ఒక విచిత్రంగా నిలిచింది. అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన తోక్ మకాన్ జాతి కోతులను చైనాకి ఎగుమతి చేయడానికి గల అవకాశాలను శ్రీలంక పరిశీలిస్తుంది. ఈ ప్రత్యేక జాతి అయిన వానరాలు కేవలం శ్రీలంకలోనే కనిపిస్తాయి‌. కోతులను సేకరించాలనే చైనా అభ్యర్థనపై అధ్యయనం చేయాలని శ్రీలంక వ్యవసాయ శాఖ మంత్రి మహేందర్ అమర్ వీర అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఎకనామిక్ నెక్స్ట్ అనే వార్త పోర్టల్ వెల్లడించింది. చైనాలోని 1000 జూలలో ప్రదర్శించడానికి లక్ష కోతులు కావాలని చైనా కోరిందని అమరవీరా తెలిపారు. అయినా వీటిని ఉచితంగా పంపిస్తారా లేదా కొనుగోలు చేసుకుంటారా అనే విషయం మీద స్పష్టత లేదు. కానీ ఆంజనేయస్వామి సీత జాడను కనుక్కోవడానికి లంకకు వెళ్ళిన తరువాత కొందరు వెనక్కి వచ్చేస్తే, మిగతా జాతి శ్రీలంకలో సెటిలైపోయారని ప్రచారం ఉంది.

అలాంటి పవిత్రమైన  శ్రీలంకలో ప్రత్యేకత కలిగిన ఈ వానరజాతిని చైనాకి పంపిస్తే అక్కడ జూలలో ప్రదర్శించడం ఏమో కానీ, ముందు వాటిని కూడా కోసుకుని తినేస్తారు. అసలే చైనా అంటే అన్ని రకాల ప్రాణులను, పాములను తినే దేశమని తెలుసు. అయితే చైనా వాళ్లకి తినడానికి కోతులు మాత్రం దొరకడంలేదని కాబట్టి ఈ తోక్ మకాన్ జాతి కోతులను ఇంపోర్ట్ చేసుకుంటున్నారని, వాటికి పిల్లలు పుట్టేలా చేసి రెగ్యులర్ గా వాటిని తినడం కోసం మాత్రమే  శ్రీలంక వాళ్ళని అడుగుతున్నారని తెలుస్తుంది.

అంతేగాని వాటిని ఉద్ధరించడానికి అయితే ఆలోచించదది. దీనిపై శ్రీలంక ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని జంతు ప్రేమికుల అభిప్రాయం. అయినా కూడా శ్రీలంక ఆ ప్రత్యేక జాతి  వానరాలను చైనాకి పంపించాలని అనుకుంటే, ఆ వానర జాతిని కాపాడటానికి ఆ హనుమంతుడే దిగి రావాలి అని అంటున్నారు కొంతమంది భక్తులు కూడా. మరి ఇప్పుడు శ్రీలంక ఈ ఎగుమతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: