జగన్ వర్సెస్‌ రామోజీ.. ఈ పోరు ఎందాక?

జగన్ ను రాజకీయంగా సమాధి చేయడం కోసం టీడీపీ, ఆంధ్రజ్యోతి ఈనాడు, టీవీ 5 లు పని చేస్తున్నాయని వైసీపీ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఇవి ఆయన్ని  జైల్లో పెట్టించడానికి కూడా వెనకాడేవి కావు. అలాంటి ప్రయత్నాల్లో కూడా గతంలో ఆయన జైలుకెల్లొచ్చారు.  తర్వాత పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి వైఎస్ జగన్,  చంద్రబాబుకు ప్రత్యర్థికి ధైర్యంగా నిలబడ్డాడు.

జగన్ ధైర్యానికి అందరు ఎంతో మెచ్చుకున్నారు. కానీ మొదటి సారి ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యారు. రాజకీయ సమాధి చేయాలనుకున్న జగన్ ప్రధాన ప్రతిపక్షంగా మారి టీడీపీ దాని మిత్రులకు మింగుడు పడకుండా చేశాడు. 65 మంది ఎమ్మెల్యేలతో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన వైపు తిప్పుకున్నారు.

అయినా మొక్కవోని ధైర్యంతో 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. జగన్ ఒక మెట్టు దిగి రామోజీ రావుతో గొడవలు వద్దనుకుని ఆయన్ని పర్సనల్ గా కూడా కలిశారని వార్తలు వచ్చాయి. కానీ ప్రధాన మీడియా ఎక్కడా కూడా ఆ వార్తల్ని రాయలేదు. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురాలేదు.  జగన్ ను ఎప్పుడూ బదనం చేసేందుకే ఈనాడు ప్రయత్నిస్తోందని ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు రామోజీ రావు ఇంటికే డైరుక్టుగా  సీఐడీ వెళ్లి మార్గదర్శి చిట్ పండ్స్ లో జరిగిన అవకతకలపై ప్రశ్నిస్తున్నారు. సీఐడీని రామోజీ ఇంటికే పంపిస్తారా అంటూ కమ్మ సామాజిక వర్గం  ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా జగన్ ను ఓడించేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. రామోజీ రావు లాంటి వ్యక్తిపైనే సీఐడీ దాడి చేయిస్తాడా అని ఏపీలో అందరూ కలిసి ఒక్కటైనట్లు వార్తలు వస్తున్నాయి.రామోజీ పైనే విచారణకు ఆదేశించారంటే జగన్ మొండోడే అని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ సీబీఐ గొడవ ఎటు దారితీస్తుందో ఏపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: