యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

క్రూడాయిల్ ధర 77 డాలర్లు ఉన్నప్పుడు ఇండియా లో పెట్రోల్ ధర 114 రూపాయలుగా ఉంది. అదే క్రూడాయిల్ 67 డాలర్లు అయినా కూడా 114 రూపాయలు పెట్రోల్ ధర ఎందుకుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  దీనికి బదులుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే రూ. 114 పెట్రోల్ ధర ఉందని అదే ఉత్తర ప్రదేశ్ లో 95 రూపాయలు మాత్రమే ఉందని కావాలంటే చెక్ చేసుకోండి అని సమాధానం ఇచ్చింది.

అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించడంలో లోపం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆయిల్ పై సుంకం 30% గా విధిస్తున్నారు. అదే కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు కేంద్రం సుంకం తగ్గించి రాష్ట్రం కూడా కాస్త తగ్గించడంతో అక్కడ పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా నుంచి భారతదేశం ఆయిల్ ను ఎక్కువగా కొనుగోలు చేసి దానిని శుద్ధి చేసి యూరప్ దేశాలకు సరఫరా చేస్తుంది.  అక్కడి నుంచి ఆయిల్ కొనుక్కునే విషయంలో భారత ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఎక్కువగా ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా దేశానికి వచ్చే ఆదాయం ప్రైవేట్ కంపెనీలకు వెళ్లిపోతుందని ప్రభుత్వం భావించింది.

దీనికోసం ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలను ఎక్కువగా డెవలప్ చేసేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆయిల్ని దిగుమతి చేసుకునే శుద్ధి చేసి వేరే దేశాలకు పంపించే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎక్కువగా ఉండాలని భావిస్తోంది. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్ విషయంలో ప్రైవేట్ సంస్థలకు ఎక్కువగా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయం పెరగడమే కాకుండా ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: