వైసీపీ.. ఇకనైనా ఆ దుర్లక్షణాలు వదిలేయాలి?

వైసీపీ అత్యుత్సాహం అనేది రోజు రోజుకు పెరిగిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇప్పటికే 7వ తరగతి, పదో తరగతి చదివిన వారికి ఓట్లు కేటాయించి పరువు పోగొట్టుకుందన్న విమర్శ ఉంది.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏమైనా అంటే వాలంటీర్లు చెప్పిన విషయం మీరు ఓటేయడానికి అర్హత సాధించారు. రేపు వచ్చి ఓటేస్తే చాలని చెప్పారు. దీంతో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కేంద్రాలకు రావడంతో విషయం బయటకు వచ్చింది.

ఏదైమైనా ఎన్ని ఫేక్ ఓట్లను తీసుకురాగలిగినా వైసీపీ మాత్రం గెలవలేకపోయిందంటున్నారు. రాంగోపాల్ రెడ్డి ఎన్నికలో 7500 ఓట్ల తేడాతో విజయం సాధిస్తే వైసీపీ రీకౌంటింగ్ అడుగుతోంది. దీనికి కారణం తెలుగుదేశం వాళ్ల దాంట్లో వైసీపీ రెండో ప్రాధాన్యత ఓట్లు వేశారని ఆరోపించారు. అయితే ఎన్ని ఓట్లు ఉంటాయి. ఎన్ని కలుపుతారు. అయినా వైసీపీ వాళ్లు టీచర్లు మాకే ఓటేశారని చెప్పారు. అయినా మళ్లీ ఈ తిరకాసం ఎందుకని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఉద్యోగులు మాత్రం వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నారని అనే అనుమానం ఆ పార్టీకి కలుగుతోంది. ఓడిపోయిన తర్వాత మర్యాదగా నమస్కారం పెట్టి వచ్చేస్తే అయిపోయే దానికి వైసీపీ మేమే గెలుస్తామనే ఆశతో ఇంకా పరువు పోగొట్టుకుంటుంది. దాని మీద ఇంకా గెలిచిన వ్యక్తిని అధికారికంగా ప్రకటించకపోవడం అనేది ఇక్కడ దారుణం. రాత్రి మొత్తం గెలిచిన ప్రకటన చేయకపోవడంపై చాలా మంది విమర్శిస్తున్నారు.

సంపూర్ణ విజయం సాధించిన వ్యక్తి గురించి ఇలా చేయడం దారుణమనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలి. వైసీపీ ఈ ఎన్నికలను పక్కన బెట్టి రాబోయే రోజుల్లో వచ్చే సాధారణ ఎన్నికల గురించి దృష్టి పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అంతర్గత బేధాలు పరిష్కరించుకుని, ప్రజల్లోకి వెళ్లి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెబితే ఏమైనా ప్రయోజనం కలుగుతుంది. కానీ ఇదే ధోరణి అవలంభిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: