శభాష్‌ కేటీఆర్‌.. ఆ విషయంలో గ్రేట్‌?

తెలంగాణ నుంచి గల్ప్ దేశాలకు ఎక్కువ మంది వలస వెళుతుంటారు. ప్రధానంగా నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి దుబాయ్, మస్కట్, సైదీ, కువైట్, దోహ కతర్ దేశాలకు వెళుతుంటారు. అయితే అక్కడ హత్య కేసుల్లో చాలా మంది ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్నారు. తెలంగాణకు చెందిన అయిదుగురు ప్రవాస భారతీయులను జైలు నుంచి విడుదల చేయాలని ప్రగతి భవన్ లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్ నజీర్ అహ్మద్ ను మంత్రి కేటీఆర్ కోరారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు లు 2007 లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దుబాయ్ షరియా చట్టం ప్రకారం..  బాధిత కుటుంబం రూ.15 లక్షల పరిహారం తీసుకోవడానికి అంగీకరించిందన్నారు.2013 లో  నేపాల్ వెళ్లి వారిని స్వయంగా కలిసి నేనే అభ్యర్థించానని మంత్రి చెప్పారు. మృతుడి కుటుంబం క్షమాపణ పత్రం దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పారు. అయినా దుబాయ్ కోర్టు వీరి క్షమాపణ పత్రాన్ని తిరిస్కరించిందన్నారు.

దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ క్షమాభిక్ష పెడితేనే సమస్య పరిష్కారం అవుతుందని హైదరాబాద్ వచ్చిన దుబాయ్ రాయబారితో చెప్పారు. ఈ విషయంలో యూఏఈ దౌత్య కార్యాలయంలో ఇప్పటికే చాలా సార్లు మాట్లాడామని అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి అయిదుగురిని విడుదల చేసేలా చూడాలని కోరారు. మంత్రి కేటీఆర్ చేసిన పనికి చాలా మంది మెచ్చుకుంటున్నారు.

కానీ ఈ అయిదుగురే కాదు ఇప్పటికీ గల్ప్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది తప్పు చేసిన వారు, మరి కొంత మంది ఏ తప్పు చేయకున్నా అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. వారందిరీని విడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: