దేవుడా.. ఓజోన్ పొరతో కొత్త ప్రమాదం?

సూర్యుడు నుండి భూమి మీద పడే కిరణాలను అతి నీల లోహిత కిరణాలు అంటారు. ఈ అతి నీల లోహిత కిరణాలు కనుక నేరుగా భూమి మీదకి పడితే భూమి మీద ప్రాణికోటి అనేదే ఉండకుండా మాడి మసైపోతారు. అయితే ఈ అతి నీల లోహిత కిరణాలు అనేటువంటి వాటిని భూమి మీదకి పడకుండా వాటిని ఓజోన్ పొర అనే ఒక పొర మధ్యలోనే అడ్డుకోవడం వల్లే మనం ఇప్పుడు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాం.

అలాంటి ఒక పొర  మనం చేసేటువంటి కాలుష్యం కారణంగా వికటించినప్పుడు దాని ఫలితంగా మనం అనేక చర్మవ్యాధులు గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఓజోన్ పొర మందంగా ఉన్నా సమస్యే అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల గుండె జబ్బులు వస్తాయట. వాతావరణం లో ఓజోన్ వాయువు కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులు దాటిపోతే గుండె జబ్బులు, పక్షవాతం, గుండె ఫెయిల్యూర్ సమస్యలతో హాస్పటల్ పాలవడం ఎక్కువ అవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అలాగే ఈ వాయువు తక్కువగా ఉన్నా ఇబ్బందేనని ఈ ఆరోగ్య సంస్థ చెప్తుంది. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చని పేర్కొంది. చైనాలో జియావోటాంగ్ విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాలు పాటు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ మేరకు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల ఓజోన్ వాయువు పరిమాణం పెరుగుతుందని వాళ్ళు వివరించారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉందన్నారు.

ఓజోన్ కాలుష్యం వల్ల వయోధికుల గుండెపైనే ఎక్కువ ప్రమాదం ఉందని వీళ్ళు వివరించారు. వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇది పెను సమస్యగా మారుతుందన్నారు. సూర్యకాంతి ప్రభావంతో ఇతర కాలుష్య కారకాలు చర్యలు జరపడం వల్ల ఓజోన్ కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ఫోటో కెమికల్ పొగ మంచుకి ఇది ప్రధాన కారణం. సూర్యుడి నుంచి వచ్చే హానికారిక అతినీలలోహిత కిరణాలను సోషించుకునే ఓజోన్ పొరకు ఇది చిహ్నం అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: