చైనాలో ఊహించని సంక్షోభం.. 17 ప్రాంతాల్లో అల్లర్లు?

చైనా ఆర్థిక సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. 31 ప్రావిన్సు లో 17 ప్రావిన్సులు ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. 1 రూపాయి ఆదాయం ఉంటే 120 రూపాయాల అప్పు ఉంది. దాదాపుగా 50 శాతం ప్రావిన్సులు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎల్జీఎఫ్డీ అనే కొత్త విధానంతో ఇండస్ట్రీ పెడితే ఆ గవర్నమెంట్ సంతకం పెడితే అప్పటి వరకు ఉన్న డిపాజిట్ ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ విధానాన్ని ఆయా ప్రావిన్సులు ఆపేశాయి.

ఎందుకంటే అప్పులు ఆదాయానికి కంటే ఎక్కువగా ఉండటం. దీంతో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. రెండు ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. కానీ అనధికారికంగా 5 ట్రిలియన్ డాలర్ల వరకు అప్పులు పెరిగిపోయాయని తెలుస్తోంది.

శ్రీలంక, పాక్ ఐఎంఎఫ్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రావిన్సుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. షాంఘైలో టీచర్ల జీతాలను ఆపేశారు. వారు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు వువాన్ ప్రావిన్సులో వృద్దులు పెన్షన్లు ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులను వాడేసుకుంటున్నారని పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమయంలో చైనాలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సామాన్య ప్రజలు, ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న వైనం.

ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగిందనుకుంటున్న చైనా ఇలా అప్పుల్లో కూరుకుపోవడం కొంచెం ఇబ్బంది కలిగించేదే. ఎక్కువ జనాభా ఉన్న చైనాలో ఆర్థికంగా దెబ్బతింటే దాన్ని పూడ్చాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. మరి ఇలాంటి కష్టాల నుంచి డ్రాగన్ దేశం ఎలా బయటపడుతుందో చూడాలి. జిన్ పింగ్ ఏ విధమైన చర్యలు తీసుకుని ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తారు. అప్పులను తీర్చే మార్గాలను ఎలా అన్వేషిస్తారు. ఎన్ని రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. చైనాలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మళ్లీ సంతోష పడే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: