మోదీ టార్గెట్‌గానే అదానీపై హిండెన్‌బర్గ్‌ కుట్ర?

పుల్వామా, పఠాన్ కోట్‌లో దాడి అనంతరం, భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్, బాలకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ దాడులే కాకుండా దౌత్య పరంగా కూడా అనేక అంశాలు జరిగాయి. సర్జికల్ స్ట్రైక్ జరిగిన అనంతరం ఆ విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియపరచడం ఇక్కడ ముఖ్యమైన అంశం. ఎందుకు అక్కడ దాడి చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడం. మా దేశం మీద దాడి చేసిన వారు ఆయా ప్రాంతాల్లో దాక్కుని ఉన్నారు కాబట్టి దాడి చేసి ఆ తీవ్రవాదులను మట్టుబెట్టామని ప్రపంచంలోని వివిధ దేశాలకు చెప్పాల్సి వచ్చింది.

ప్రస్తుతం భారత్ పై అమెరికాలో ని వ్యాపార దిగ్గజాలు జార్జి సోరోస్, గేట్స్ పౌండేషన్ ఆర్థికపరమైన అంశాలపై ఒక రకమైన సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాయన్న వాదన ఉంది.  ఎందుకంటే భారత్ లో ఫార్మా ఇండస్ట్రీస్ ను దెబ్బకొట్టే ప్లాన్ చేస్తున్నాయంటున్నారు. అదానీ కంపెనీలు లాస్ లో ఉన్నాయని దాదాపు 100 బిలియన్ డాలర్లు నష్టపోయే విధంగా చేశారంటున్నారు. దీంతో దాదాపు 1 వ స్థానం నుంచి 30 స్థానంలోకి పడిపోయారు. దీని కోసం అమెరికా సంస్థలు చేయని ప్రయత్నం లేదు. అంతే కాదు మిగతా కంపెనీలను కూడా దెబ్బతీయచ్చని ప్లాన్ చేశారు. భారత స్టాక్ మార్కెట్ ను కుప్పకూల్చలాని ప్రయత్నాలు చేశారనన్న వాదన ఉంది.

కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పడూ ఉండే అప్ అండ్ డౌన్స్ తప్ప మన స్టాక్ మార్కెట్ బలంగా ఉంది. గూగుల్ సంస్థకు లక్షల కోట్ల నష్టం వచ్చి, వేల మందిని తీసేశారు, మైక్రోసాప్ట్ సంస్థ కొన్ని వేల మందిని తీసేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. పాశ్చాత్య దేశాల భావన ఎంటంటే భారత్ లో మళ్లీ మోడీ వస్తే భారత్ ను దెబ్బతీయడం కష్టమని ఆయనను రాకుండా చేసేందుకే ఇలాంటి ఆర్థిక పరమైన అంశాలపై దాడి చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: