ఆ 4 దేశాలు చేతులు కలిపితే.. అమెరికా ఔట్‌?

అమెరికా ఇంకా యూరప్ దేశాల వైఖరి నచ్చక మరో నాలుగు అగ్ర దేశాలు కలిసి ఈ రెండు దేశాలకు విరుద్ధంగా ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. రష్యా, ఇరాక్, చైనా, ఉత్తర కొరియా ఈ నాలుగు దేశాలు ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ దేశాల విశ్లేషకులు. అసలు ఆ సందేహానికి బీజం ఏమిటంటే, మొన్న ఒక సదస్సు సందర్భంగా అమెరికన్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు ఈ సందేహానికి కారణం అవుతున్నాయి.

మొన్న మ్యూనిచ్ సదస్సు సందర్భంగా అమెరికన్ సెక్రటరీ అయినటువంటి ఆంటోనీ బ్లింకన్ చైనా దేశం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో చైనా కూడా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఉత్తర కొరియా మొన్న ఒక బాలిస్టిక్ మిస్సైల్ ని జపాన్ అకాడమిక్ జోన్ లో ప్రయోగిస్తే దానికి ప్రతిగా అమెరికా, జపాన్ ఇంకా సౌత్ కొరియా కలిసి ఉత్తర కొరియా సరిహద్దుల్లో తమ తమ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేశారు.

దాంతో చిర్రెత్తుకొచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తమ దేశం తరఫున కూడా మరొక మిస్సైల్ ని ప్రయోగించడంతో ఒక్కసారిగా ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఎక్కడ ఏ తేడా వచ్చినా ఈ రెండు వర్గాలుగా ఉన్న ఈ దేశాల మధ్య కోట్లాట మొదలవుతుంది.

రష్యా, ఇరాక్, చైనా, ఉత్తర కొరియా ఇలా ఈ నాలుగు దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇంకా నాటో దేశాల కూటమికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడితే, కూటమిగా ఏర్పడి కలహిస్తే వారి వారి దేశాల సార్వభౌమాధికారం ఇంకా గొప్పదనం చూపించుకోవడం కోసం అయినా మిగిలిన ప్రపంచ దేశాల పరిస్థితి పట్టించుకోకుండా ముందు ముందు  యుద్ధానికి  సిద్ధమయ్యే పరిస్థితి అయితే ఉందని అంటున్నారు. అలా జరిగితే అది మరో ప్రపంచ యుద్ధమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: