పురంధేశ్వరి తెలుగుదేశంలోకి వచ్చేస్తారా?

పురందేశ్వరి బీజేపీ పార్టీని దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలనుకున్నప్పుడు రంగా పేరు పెట్టాలని కోరిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమ. ఎన్టీఆర్ పేరును పెట్టడం టీడీపీకే ఇష్టం లేదు. మరో కారణం తమ ప్రభుత్వ హాయాంలో పేరు పెట్టకపోవడం.

కడప జిల్లాకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య వైఎస్సార్ కడప జిల్లా అని పేరు పెట్టారు. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఎన్టీఆర్ పేరు వాడుకోవడం టీడీపీకి కావాలి కానీ ఏ జిల్లాకు ఆయన పేరును పెట్టడానికి టీడీపీ ఇష్టపడ లేదు. రంగ పేరు కూడా పెట్టండి అని జీవీఎల్ అంటే పురందేశ్వరి ఇప్పుడు మాట్లాడుతూ.. ఆ మహానుభావులు అన్నారు.. ఎన్టీఆర్ పేరు కాకుండా రంగ పేరు పెట్టమని అడుగుతున్నారని బీజేపీతో తెగదెంపులు చేసేసుకుంది.

మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎందుకు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ నుంచి వెళ్లి పోవడానికి  కోటం రెడ్డి, ఆనం, మేకపాటి ఒక్కో కారణాన్ని వెతుక్కుంటున్నారు. ఇదే కోవలో బీజేపీ నుంచి బయటపడ్డానికి పురందేశ్వరి ఎన్టీఆర్ జిల్లా పేరు ను వాడుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒంగోలు లేదా విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకుంటున్నారు. ఒంగోలు స్థానానికి పోటీ చేయాలని ఆమె కోరుకుంటున్నారు.

భువనేశ్వరి, పురందేశ్వరి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు. కుటుంబ సాన్నిహిత్యం పెరిగిపోతుంది. దగ్గుబాటి రాజకీయాల నుంచి పక్కకెళ్లి పోయాక ప్రస్తుతం పురందేశ్వరి అనుకున్న స్థానంలో అనుకున్న విధంగా పోటీ చేయాలనుకుంటోంది. పురందేశ్వరికి ఎంపీ స్థానం, ఆమె కొడుకుకి ఎమ్మెల్యే స్థానం ఖరారు చేస్తే టీడీపీ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సంవత్సరాలుగా  టీడీపీకి దూరంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉన్న పురందరేశ్వరి టీడీపీలో నెగ్గుకు వస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: