మన వెంకయ్యనాయుడు ప్రధాని అవుతారా?

వెంకయ్య నాయుడికి ప్రధాని అయ్యే అవకాాశం ఉందా? అవుననే అంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు వారి మిత్రపక్షాలు. 2014,2019  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో ఏకపక్షంగా అధికారాన్ని చేపట్టింది. మేజిక్ ఫిగర్ అందుకున్నప్పటికీ మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏగానే పని చేస్తోంది. ప్రధానిగా మోదీ రెండు సార్లు దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తున్నారు.

అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి లోక్ సభలో సీట్ల సంఖ్య తగ్గితే మాత్రం ప్రధానిగా మోడీని కాకుండా వెంకయ్య నాయుడిని చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో తెర వెనక భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ మద్దతు కూడగట్టుకుని వెంకయ్యను ప్రధానిని చేసే అవకాశం కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 15 ఎంపీ స్థానాలు గెలిస్తే, నవీన్ పట్నాయక్ 20 స్థానాలు, తెలంగాణలో బీఆర్ఎస్ ఒక పది స్థానాలు ఇలా దాదాపు 45 నుంచి 50 సీట్లు దాకా సాధిస్తే, అక్కడ బీజేపీకి సీట్లు తగ్గితే వెంకయ్య ను ప్రధానిగా ప్రతిపాదించే అవకాశాలు లేకపోలేదని వినిపిస్తున్న టాక్.  2019 లో కూడా టీడీపీ నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా పెడితే మా మద్దతు ఉంటుందని బహిరంగంగానే  చెప్పింది.

వచ్చే ఎన్నికల్లో తృతీయ ప్రంట్ ఎలాగో మెజార్టీ సీట్లు సాధించేలా లేదు. కాంగ్రెస్ కు కొంత రాహుల్ ఛరిస్మా పని చేస్తున్నా అది పూర్తి స్థాయిలో లోక్ సభలో ఆధిపత్యాన్ని దక్కించుకునేలా కనిపించడం లేదు. మమత బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, శివసేన వీరందరూ కలిసినా మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. అదే సమయంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే టీడీపీ, నవీన్ పట్నాయక్, మరో పార్టీ కలిపి వెంకయ్యను ప్రధానిగా కూర్చోబెట్టినా ఆశ్చర్చపోనక్కర్లేదు. చూడాలి తెలుగు రాష్ట్రాలు సంచలనం సృష్టిస్తాయా అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: