పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

దేశం ఆర్థికంగా బలోపేతం అయినపుడే ప్రపంచంలో మనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉన్న చోట మన మాట చెల్లుబాటవుతుంది. ఏ దేశమైనా మనం చెప్పినా దానికి అంగీకరిస్తాయి. మద్దతు పలుకుతాయి. ఒకప్పుడు ఇండియా అంటే పట్టించుకునే వారు కాదు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ఏది చెబితే దానికే సై అనేవారు.

వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అణు పరీక్షలు నిర్వహించారు. అగ్రరాజ్యాలు, ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్న అణు పరీక్షలు జరిపారు. దీంతో భారత్ పూర్తి స్థాయి అణ్వస్త్ర దేశంగా భారత్ మారిపోయింది. అప్పటి నుంచి భారత్ అంటే వివిధ దేశాల్లో ప్రత్యేకమైన గౌరవం, భయం కూడా పెరిగిపోయాయి. అణు పరీక్షలు నిర్వహించే సమయంలో చాలా దేశాలు వ్యతిరేకించాయి.

కానీ అణ్వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ వాడం. దాదాపు శాంతియుత పరిస్థితుల్లోనే ఉంటాం. దీంతో తయారీ సమయంలో వ్యతిరేకించిన దేశాలు అనంతరం ఏమీ అనలేవు. టర్కీ , చైనా ఇచ్చిన సాయంతో రెండు అణు బాంబులను పాకిస్థాన్ తయారు చేసుకుని ఆనాడు విర్రవీగింది. భారత్ వద్ద అణుబాంబులు ఉన్నా ఏనాడు ఎవరిని రెచ్చగొట్టలేదు.

ప్రస్తుతం టర్కీలో వచ్చిన భూకంపంతో ఆ దేశం భీతవాహ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో పాక్  ప్రధాని టర్కీ వస్తామని చెబితే ఆ దేశం వద్దని చెప్పింది. ఇప్పటికే భూకంపంతో ఆ దేశం అతలాకుతలమై నానా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు పాక్ ప్రధాని అక్కడికి వెళ్లి చేసేదేమీ లేదు. దీంతో నిర్మోహమాటంగా వద్దని చెప్పేసింది. సాయమందిస్తే వెళ్లినా బెటర్ కానీ ఈయన దగ్గరే డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు.  గతంలో పాక్ కు మద్దతు ఇచ్చి, కశ్మీర్ పై పిచ్చి కూతలు కూసిన టర్కీ ఇంతటి విపత్కర సమయంలో భారత్ చేసినా సాయాన్ని చూసి మీరు మా స్నేహితులు అంటూ అభిమానం కురిపిస్తోంది. ఆపదొస్తే గానీ టర్కీకి భారత్ విలువ తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: