బీబీసీ మోదీ డాక్యుమెంటరీని వాడేసుకుంటున్న పాకిస్తాన్‌?

పాకిస్తాన్ కి సంబంధించిన నాయకులు అక్కడ ఏర్పడిన సంక్షోభం నుండి, కరువు నుండి ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి వారికి దొరికిన ఒక ఊతం బీబీసీ ఛానల్. పాకిస్తాన్లో జనాభా తినడానికి తిండి లేదు, చేయడానికి ఉద్యోగం లేదు, కరెంటు బిల్లులు కూడా కట్టలేక ప్రజలు రోడ్ల మీద పడుతున్నారు. తమ జీవన  పరిస్థితి మెరుగుపడడానికి  ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది అక్కడ. అక్కడ వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. పెట్రోల్, డీజిల్ కూడా అక్కడ రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారు.

తప్పని సరి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం ప్రజాగ్రహానికి  గురయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో మండే ఆ ప్రజాగ్రహాన్ని ప్రక్క త్రోవ పట్టించడానికి అక్కడి ప్రభుత్వం కంకణం కట్టుకున్న వేళ అది బీబీసీ ఛానల్ ని ఆయుధంగా వాడుకుంటుంది. గోద్రాలో చూశారా ముస్లింల పరిస్థితి ఎలా ఉందో అంటూ బీబీసీ న్యూస్ పట్టుకుని, పాకిస్తాన్ లోని ముస్లింల పరిస్థితి అంతకన్నా చాలా బెటర్ అని నిరూపించడానికి, ప్రజల్ని మాయ చేయడానికి  ప్రయత్నిస్తుంది అక్కడ ప్రభుత్వం.

షబా షరీఫ్ వివాదస్పద వ్యాఖ్యలపై చర్చల కోసం ఇంకా SCO శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కావాలని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టోకు భారతదేశం ఆహ్వానం పంపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యునికి ప్రతిస్పందిస్తూ న్యూఢిల్లీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన హీనా రబ్బానీ కౌర్ BBC మోడీ సిరీస్‌ను లాగారు.  షాబా షరీఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఎటువంటి బ్లాక్‌మెయిల్ ఛానల్ దౌత్యం లేదని హీనా అన్నారు.

పాకిస్తాన్ ఎల్లప్పుడూ తన పొరుగువారితో శాంతి కోసం పాతుకుపోయిందని కూడా ఆమె పేర్కొంది. చర్చలలో  భారతదేశం యొక్క అణు బెదిరింపులను కూడా ఆమె ఎత్తిచూపారు. భారతదేశం అణ్వాయుధాల దేశం కాబట్టి చర్చించలేకపోతున్నాం లేదంటే మేము శాంతికాముకులం అని నక్క వినయాలు పోతుంది పాకిస్తాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: