ఆ దేశం కోసం.. ఇండియా ప్రపంచానికి శత్రువు అవుతుందా?

భారత్ లో జరగనున్న జీ20 సదస్సులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరగాలని అమెరికా తో పాటు పలు దేశాలు భావిస్తున్నాయి. 100 కి 90 శాతం దేశాలు చర్చ జరగాలని కోరుకుంటున్నా భారత్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అమెరికా, మిగతా దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడి ని పిలవాలని ఇక్కడ చర్చ జరగాలని అనుకుంటున్నారు. కానీ దీనిపై చర్చ ఇక్కడ అవసరం లేదు అని ఇండియా వాదిస్తోంది.

ఐక్యరాజ్య సమితి లో లేదా ఏదైనా ప్రత్యేక సమావేశం లో నే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై వాదనలు జరగాలి. కానీ జీ20 సమ్మిట్ లో కాదు అనేది భారత్ చెబుతున్న అంశం. భారత్ ఒప్పుకోకపోవడానికి కారణం రష్యాతో భారత్ కి ఉన్న బలమైన ఆర్థిక ఒప్పందాలు, ముఖ్యంగా చమురు దిగుమతి, ఆయుధాలను ఎక్కువగా మనమే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సమయంలో జీ 20 సమ్మిట్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు ని పిలిస్తే భారత్ కి రష్యాకు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి.

చాలా దేశాలు ఇదే కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. జీ 20 సమ్మిట్ నిర్వహించే వారిని షేర్ష అంటారు. ప్రస్తుతం ఈ షేర్ష అమితాబ్ కాంత్ ఇండియాలో దీని నిర్వహణ ఉంది. కాబట్టి ఆయన దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. జీ 20సదస్సు 20 దేశాలలో ఉన్న ఆర్ధిక, పర్యావరణ పరిస్థితులు, ఆయా సమస్యలకు పరిష్కారం చూపడం. కానీ ఇపుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై చర్చ జరగాలని అనుకోవడం అసంబద్దం అని ఆయన అన్నారు.

ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఉక్రెయిన్ వైపు నిలుస్తుంటే భారత్ మాత్రం రష్యా తో స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎన్ని విధాలుగా ఆయా దేశాలు ఈ బంధాన్ని విడగొట్టడానికి ప్రయత్నించిన అది ఇంకా విజయవంతంగా కొనసాగుతూనే ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: