చంద్రబాబు చేసిన ఆ తప్పే.. జగన్ కూడా చేస్తున్నారా?

తెలుగుదేశం ఓటమికి ప్రధాన కారణం ఎన్నికలు సమీపిస్తున్న చివరి ఏడాది ఇబ్బడి ముబ్బడిగా ఆ పార్టీ కార్యకర్తలకు కాంట్రాక్టులు ఇవ్వడం. చివరకు ఎమైందంటే వారికి బిల్లులు చెల్లించే సమయానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుండా పోయింది. ఉన్న డబ్బుల్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు కుంకుమ పథకం కింద ప్రజలకు రూ. 10 వేలు ఇంటింటికీ చెల్లించేశారు. దీంతో ఖజానాలో డబ్బు లేకుండా పోయింది. పోనీ దీని వల్ల లాభం చేకూరిందా అంటే అసలు లేదు.

సంపూర్ణ రుణ మాఫీ అమలును అటకెక్కించారనే కోపంతో ప్రజలు ఈ పథకాన్ని అసలు పట్టించుకోలేదు. సరికదా తెదేపాకు ఓటమి రుచి చూపించారు. ప్రధానంగా పసుపు కుంకుమ కింద చెల్లించిన డబ్బులు నష్టపోయింది తెదేపా కార్యకర్తలు, నాయకులని చెప్పుకోవాలి. దీంతో తర్వాత స్థానిక ఎన్నికల్లో తెదేపాకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తల పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతోంది. అసలు కాంట్రాక్టులు పార్టీల కార్యకర్తలకు ఇవ్వకూడదు. కానీ ఇస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించండని ఓ ప్రధాన పత్రికలో వార్త ప్రచురితం అయింది.

ఈ అంశానికి ప్రధాన కారణం కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ కార్యకర్తలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు చేసిన పనులు వివరాలతో సహా ధర్నా చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో విచిత్రమేమిటంటే ప్రధాన పత్రిక ఓ ట్విస్ట్ రాసింది. పేదలు, సామాన్యులు అని ఆర్టికల్ లో వివరించింది. పేదలు ఎక్కడయినా కాంట్రాక్టులు చేస్తారా? చేయగలరా  జరిగింది విషయం వాస్తవమైనా మరి ఆ ప్రధాన పత్రికలో ఇలా రాయడం ఎంటో విడ్డూరం కాకపోతే.. ఏదైమైనా ఎమ్మెల్యేలు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారంటే విచిత్రమే మరి. ఏ ప్రభుత్వం ఉన్నా కాంట్రాక్టులు ఓ క్రమ పద్ధతినా చట్ట ప్రకారం ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు సాఫీగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు డబ్బులు సరిగా అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: