ప్రాణాలు తీసిన కోడికత్తి.. జగన్‌ కేసుతో లింకేంటి?

ఆయుధం ఎప్పటికీ ఆయుధమే.. చిన్న తుపాకీ అయితే చనిపోతారు, పెద్ద తుపాకీ అయితే చనిపోరు అనేది ఏమీ ఉండదు. ఏ తుపాకీ అయినా ప్రాణం పోతుంది. కత్తి అనేది కాలికి దిగితే కాలు కోసుకుపోతుంది. పీకకు దిగితే ప్రాణమే పోతుంది. దాని పదును ఎక్కడ వాడుతాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. గతంలో ఏపీ సీఎం జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంధర్భంలో ఎన్నో జోకులు, విమర్శలు కూడా విన్నాం.  కోడి కత్తి అంటూ వెటకారాలు జోకులు వేశారు. అలా జోకులు వేసేవారు కోడి కత్తిని తమ పీకపై కోసుకొని జోగులు వేస్తే తెలిసేది దాని పదును ఏంటి అనేది. దానికి సరైన సాక్ష్యాలు లేవు అంటూ ,అయినా కోడి కత్తితో ప్రాణాలు పోతాయా.. అంటూ జోకులు వేశారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తాజాగా కోడి కత్తితో ప్రాణాలు పోయినా సంఘటన కలకలం సృష్టించింది. తూర్పు గోదావరి జిల్లా కోడిపందాల్లో ఈ విషాదం నెలకొంది. నల్లజర్ల మండలం, అనంతపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పందెంకోడి కత్తి గుచ్చుకొని పద్మారావు అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తరువాత పందెం రాయుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు పద్మారావు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కోడికి కత్తి కడుతున్న సమయంలో ఆ కోడి ఎగరడంతో పక్కనే ఉన్న పద్మారావుకు కత్తి గుచ్చుకొని మృత్యువాత పడ్డారు.

అంటే కోడి కత్తి కి కూడా ప్రాణాలు పోతాయని రుజువైందన్నమాట.. కోడి కత్తి కూడా పదునైన ఆయుధమే.. మరి గతంలో జగన్‌ కేసు విషయంలో ఇదే విషయాన్ని అంతా కామెడీ చేశారు. హత్యాయత్నం కేసును.. కోడికత్తి కేసు కోడి కత్తి కేసు అంటూ వెటకారం చేశారు. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి ఘటనతో దాని సీరియస్‌నెస్‌ అందరికీ అర్థమైందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: