బాబు కుప్పం టూర్‌లో జనసంద్రం.. అసలు కథ ఇదా?

చంద్రబాబు మొన్న కుప్పం వెళ్లడానికి ముందే కార్యకర్తలు నాయకులు అక్కడ ఆయన కోసం ఎదురు చూశారు. కానీ ఆయన వెళ్లే రోడ్డు మ్యాప్ ను ఇవ్వమని ప్రభుత్వం అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ రోడ్డు మ్యాప్ ను ఇవ్వలేదని సమాచారం. ఆయన తిరిగే గ్రామ ప్రాంతాల్లో టూర్ మ్యాప్ ఇవ్వమంటే అది కూడా ఇవ్వలేదట. ‌దానితో టూర్ మ్యాప్ ఇవ్వకపోతే ఆ టూర్ కి అనుమతి నిచ్చేది లేదని పోలీసులు చెప్పారని తెలుస్తుంది‌.

ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులతో.. మీరు వెళ్లి చంద్రబాబునాయుడు గారితో చెప్పుకోండి అనడంతో డీఎస్పీ వెళ్లి సభలు అయితే మైదానంలో పెట్టుకోండని సలహా ఇచ్చారు. అదే రోడ్ షో అయితే ఏ రోడ్డులో వెళతారో చెప్పండి అని చంద్రబాబునాయుడు గారిని డైరెక్ట్ గా అడగడంతో ఆయనకు ఆగ్రహం వచ్చేసింది. మీరు ఎవరు మమ్మల్ని ఆపడానికి, మమ్మల్ని ప్రజలతో దూరం చేస్తారా అని ప్రజల మధ్యనే చంద్రబాబు రెచ్చిపోయారు.

కానీ పోలీసుల వైపు నుండి  వాళ్ళు చెప్పేదేంటంటే మీరు పాదయాత్ర చేస్తుంటే ఆ రోడ్డు మ్యాప్ ఇవ్వండి ఇవ్వకపోతే  మీ భద్రతను చూడటానికి ఇబ్బంది అవుతుందని చెప్పామని వాళ్ళు చెప్తున్నారు. ఇలా పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు దారిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీనిపై సాక్షి పేపర్లో ఒకరకంగా, టీడీపీ అనుకూల పేపర్ లో ఒక రకంగా  న్యూస్ వచ్చింది.

అయితే  కుప్పం పర్యటనకు సంబంధించిన వీడియోని చూస్తే  అక్కడ పోలీసులు చంద్రబాబు నాయుడుని నిలదీసినందుకు జనాలందరూ ఒక మహా సముద్రంలో  కదిలొచ్చినట్టు కథనం వినిపించారు‌ తెలుగుదేశం పార్టీ వాళ్లు. కానీ అసలు విషయం వేరేనట. అది విజయపురిలో సిద్దేశ్వర స్వామి పరమపదించిన నేపథ్యంలో  వచ్చిన భక్తులకు సంబంధించిన వీడియో అని, ఆయనను చూడడానికి వచ్చిన సుమారు 5 లక్షల మంది జనాన్ని  చంద్రబాబు నాయుడు కోసం వచ్చిన జనంలా వక్రీకరించారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: