బీజేపీతో తెలుగు దేశం పొత్తు ఉంటుందా.. ఉండదా?

తెలంగాణలో భారతీయ జనతాపార్టీ అంతర్గత సమావేశాలు రెండు రోజులు జరిగాయి. తెలంగాణ  రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా  విస్తరక్ లను, పాలక్ లను నియమించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్న పార్టీలో ఇద్దరు కీలక నేతలైనా విజయశాంతి, ఎంపీ అర్వింద్.. టీడీపీతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై భిన్న ప్రకటనలు చేశారు. బయట టీడీపీ అనుకూల మీడియా టీడీపీతో భాజపా పొత్తు పెట్టుకున్నట్లు, తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలో కూడా పొత్తు అయిపోయినట్లు ప్రచారం కూడా చేసేస్తోంది.

అసలు వారితోనే మనకు మన పార్టీకి ఓట్లు పడతాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ టీడీపీతో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండదని పైనుంచి చెబుతున్నా సందేశాన్నే మీకు వివరిస్తున్నానన్నారు. ఆయన కూడా పొత్తు ఉండదని బహిరంగంగానే చెప్పేశారు. అయినా గతంలో ఒకసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని  పార్టీ తీవ్రంగా నష్టపోయినట్లు అసలు ఆ అవసరం మనకు లేదు అని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదే మాట రాష్ట్ర సీనియర్ నాయకులు లక్ష్మణ్ చెప్పగలరా? బీఎల్ సంతోష్ దీన్ని సమర్థిస్తారా? వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంచితే కార్యక్రమంలో అంతర్గతంగా మరో తీవ్ర చర్చ నడిచినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఎత్తుగడలు, బీఎల్ సంతోష్ కౌంటర్ ఎటాక్ లు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరుగుతున్న చర్చల్లో కేసీఆర్ దూకుడుకు ఎలాంటి ఎత్తుగడలతో సమాధానం చెప్పాలో చర్చించినట్లు సమాచారం.

అసలేమాత్రం ప్రభావం లేని టీడీపీ తో పొత్తు భాజపాకు కలిసి వస్తుందా.. సైకిల్, కమలం జోడి కడతాయా.. ఒకవేళ ఒక్కటైనా  కేసీఆర్ ట్రిక్కుల ముందు రెండు పార్టీలు తెలంగాణలో ప్రజల అభిమానాన్ని పొందగలవా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కానీ.. వాటికి సమాధానం ప్రస్తుతం లేదు.. ఏమో మరో కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయి.. అప్పటివరకు ఈ సస్పెన్స్  ఇలాగే కొనసాగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: