సొంత వ్యాక్సీన్లే చైనా కొంప ముంచాయా?

ఏదైనా దేశ ప్రజల  హెర్డ్ ఇమ్యూనిటీ అనేది.. ఆ దేశపు ప్రగతికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. చైనాలో కరోనా ఇప్పుడు  మృత్యు ఘంటికలు మోగించడానికి కారణం అక్కడ దేశంలోని ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ లేకపోవడమే. చైనాను ఇప్పుడు అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ తొలిదశ వ్యాప్తి మాత్రమేనని.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత జనవరి చివరికి సెకండ్ వేవ్ మొదలవుతుందని.. ఫిబ్రవరి చివరి నాటికి సెలవులు ముగిసి జనాలు సొంత ఊర్లకు వెళ్లిన తర్వాత థర్డ్ వేవ్ మొదలవుతుందని నిపుణులు అంటున్నారు. అప్పుడు జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమేనని చైనా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా కరోనా వచ్చిన వ్యక్తికి రెండు ఏళ్ళ దాకా తిరిగి కరోనా రాదు. ఎందుకంటే బాడీలో వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ , వైరస్లతో పోరాడుతూ ఉండడమే దానికి కారణం. చైనాలో కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక  చాలామంది వ్యాక్సిన్లు వేయించుకోలేదు. అక్కడ జనాల్ని కరోనా భయంతో నిర్బంధంలో పెట్టడం వల్ల కూడా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది వాళ్ళలో పడిపోయింది. భారత్ టీకాలు అన్ని డోసులు వేయించుకున్న వాళ్లకు 99.3% అవి వాళ్లపై సమర్థంగా పనిచేస్తాయి.కానీ చైనా టీకాలకు ఆ సరైన సామర్థ్యం లేకపోవడంతో ఆ టీకా వేయించుకున్న వాళ్ళు పదేపదే కరోనా బారిన పడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా టీకాలకు  సమర్థత 79% ఉందంటే కాదు హాంకాంగ్ యూనివర్సిటీ అధ్యయనం అది 60 లోపే అని తేల్చేసింది. ఆసియా లైఫ్ పత్రిక ప్రకారం జర్మనీ వ్యాక్సిన్ ఫైజర్ బయో ఎమ్టెక్  కన్నా చైనా వ్యాక్సిన్ వాడేవాళ్ళలో మరణించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. కరోనా వ్యాధి వల్ల వ్యాధి నిరోధక యాంటీ బాడీలు సగానికి సగం తగ్గిపోయాయని థాయిలాండ్ పరిశోధనల్లో తేలింది. మొత్తానికి చైనాను తాను చేసుకున్న పాపం వెంటాడుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: