బీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీ అయ్యే సత్తా ఉందా?

బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలను శాసించాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. అసలు కేసీఆర్ పెట్టింది జాతీయ పార్టీ ఎలా అవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లతో గెలిస్తేనే జాతీయ పార్టీ అవుతుంది. అయితే కేసీఆర్ పార్టీకి జాతీయ హోదా రావాలంటే.. పలు ప్రాంతాల్లో గెలవాల్సిన పరిస్థితి. అయితే గతంలో శరద్ పవార్, స్టాలిన్, మాన్, కేజ్రీవాల్ అని ఇలా పలు ప్రాంతీయ పార్టీల సీఎంల చుట్టూ తిరిగారు కేసీఆర్.

బీఆర్ఎస్ పార్టీక వీరందరి మద్దతు ఉంటుందని భావించారు. కానీ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. వీళ్లెవరూ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు. వచ్చిందల్లా అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి. పోనీ వీరైనా ప్రస్తుతం అధికారంలో ఉన్నారా అంటే అది కూడా లేదు. ఇక కర్ణాటకలో భూస్థాపితం అవుతున్న పరిస్థితి కుమారస్వామి జేడీఎస్ పార్టీది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామంటే జేడీఎస్ కు అది కుదరదు. అధికారంలో ఉన్న టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేసిన ఘనకార్యం వల్ల భయపడిపోతున్నారు.

మరోవైపు బీజేపీతో పొత్తుపెట్టుకుందామన్నా.. అది కుదరట్లేదు. దేవగౌడ పేరుకే ఎంపీ అయినా.. ఆయన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మరోవైపు ఆయన రాజకీయాల్లో చురుగ్గా లేరు. ప్రస్తుతం కుమారస్వామిది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్.ఈ టైంలో కేసీఆర్ వెంట వచ్చారు కుమారస్వామి.  బీఆర్ఎస్ మద్దతుతో కర్ణాటకలో ఒక 15 సీట్లు గెలుచుకోవచ్చని ఆలోచిస్తున్నారు.

మరోవైపు సొంతంగా ఒక 15 గెలుచుకుని.. మొత్తం 30 వరకు సీట్లతో కర్ణాటకలో అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఇక  కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మరొకరు అఖిలేశ్ యాదవ్. ఉత్తరప్రదేశ్ లో తెలంగాణ సెంటిమెంట్ సాధ్యం కాదు. ఏదో అఖిలేశ్ తండ్రితో కేసీఆర్ కు ఉన్న సాన్నిహిత్యంతో కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చి అభినందనలు చెప్పి వెళ్లారు.  ఈ ఇద్దరి మద్దతుతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొనసాగాలని కలలు కనడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: