ఏపీ బరిలో ఆప్‌ దిగితే.. జగన్‌ పరిస్థితి ఏంటి?

ఆమ్ ఆద్మీ పార్టీకి జనాల్లో విశ్వనీయత ఎక్కువ ఉంది. ఒకవేళ ఏపీ నుంచి ఆప్ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. ఆప్‌ పాలనలో చెప్పినవి చేస్తున్నారనే పాజిటివిటీ కూడా ఉంది. పరిపాలనపరంగా మార్పులు చేసింది ఆప్. ఢిల్లీలో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఉచిత విద్య, గ్యాస్ సిలిండర్ రాయితీలు ఇస్తున్నారు. ఈ పథకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హిమచల్ ప్రదేశ్ లో అయితే ఇలాంటి హామీలు ఇస్తే కుదరదు పొమ్మన్నారు. కానీ.. ఏపీలో ఇలాంటి హామీలు ఇస్తే ఓటేస్తారేమో.

మధ్యప్రదేశ్ లో ఎన్నికలు ముందుండటంతో.. ఆప్ హామీల వర్షం కురిపించింది. డిగ్రీ పాసైన వారికి రూ.5 వేలు, గృహిణికి రూ.2 వేలు, 300 యూనిట్ల కరెంట్ ఫ్రీ, 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత భోజనం లాంటి హామీలిచ్చింది. ఇలాంటి హామీలకు ఏపీ ప్రజలు అట్రాక్ట్ అవుతారు. తెలుగు దేశానికి వచ్చే సరికి హామీ ఇచ్చి.. వాటిని అమలు చేయలేదు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కు ఓటేస్తే ఇస్తాడో లేదో తెలియదు. గతంలో చెప్పినవన్నీ జగన్ అమలు చేశారు కాబట్టి.. ఇవన్నీ జగన్ చెప్తే నమ్ముతారు. లేకపోతే.. ఆప్ వచ్చి ఇలాంటి హామీలు ఇస్తే ఓటు మాత్రం వేయడం ఖాయం.

మరోవైపు ఇప్పటికే జగన్ సర్కారు అనేక హామీలు ఇచ్చింది. వాటిలో చాలా వరకూ అమలు చేసింది. ఇక ఆప్‌ కూడా అలాంటి హామీలు ఇస్తే.. ఏపీ ఖజనా ఆ భారం తట్టుకుంటుందా అన్న అనుమానం లేకపోలేదు. ఇప్పటికే జగన్ సర్కారు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కిందా మీదా పడుతోంది. మరి ఇంకా ప్రజాకర్షక పథకాలు ఏపీలో అమలు చేయాలంటే.. ఉన్న వాటిలో కొన్నింటిని ఆపేయాల్సి ఉంటుంది. జగన్ సర్కారు ఇచ్చే హామీల్లో కొన్ని అనవసరం అన్న వాదన కూడా ఉంది. అలాంటి వాటిని తగ్గిస్తే కొత్త హామీలు అమలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: