ఆ ఫేక్‌ ఐపీఎస్‌తో టీఆర్‌ఎస్‌ మంత్రి, ఎంపీలకు లింకేమిటి?

నకిలీ సీబీఐ అధికారి కొవ్వి రెడ్డి శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ విచారించింది. శ్రీనివాస్ తో సంబంధాల పై 8 గంటల పాటు గంగుల, వద్దిరాజును సీబీఐ ప్రశ్నించింది. నకిలీ సీబీఐ అధికారిగా చెలామణి అయిన శ్రీనివాస్ తో ఉన్న సంబంధాలు, ఆర్ధిక లావాదేవీలు సహా జరిపిన సంభాషణలపై ఆరా తీసింది. తమ న్యాయవాడులతో పాటు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర.. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు.

తాము చెప్పిన అంశాలను రికార్డ్ చేసుకున్నారుని.. సిబిఐ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని, మేము ఇచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నారని గంగుల తెలిపారు. నిందితుడు శ్రీనివాస్‌ను కూడా మాముందు ఉంచి పలు ప్రశ్నలు అడిగారని.. ఇది చివరి విచారణ, మళ్లీ విచారణ అవసరం లేదని చెప్పారని మంత్రి గంగుల అన్నారు. తాము ఇచ్చిన సమాధానాలతో సిబిఐ అధికారులు సంతృప్తి చెందారన్న  మంత్రి గంగుల.. మాతో ఎటువంటి లావా దేవీలు జరపలేదని శ్రీనివాస్ ఒప్పుకున్నాడని... తాము ఇచ్చిన స్టేట్మెంట్ పై సంతకాలు తీసుకున్నారని వివరించారు.

నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్ ను మా ఎదురుగా కూర్చోపెట్టి విచారణ చేశారని మరో టీఆర్ఎస్‌ నేత, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. సీబీఐ అధికారులకు అన్ని అంశాలు వివరించామని.. అన్ని విధాల సీబీఐ అధికారులకు సహకరించామని టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. శ్రీనివాస్ గోల్డ్ తనే కొనుకున్నారని... ఇంటితో ఈ అంశం పూర్తి అయిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరించారు.

కొందరు మాపై ఆరోపణలు చేయించారన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. శ్రీనివాస్ ను కాపు సమ్మేళనంలో కలిసామని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులతో కంగారు పడుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు ఈ నకిలీ ఐపీఎస్‌ వ్యవహారం మరింతగా చిరాకు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: