బాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మంటలే మంటలు?

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య వైరాలు భగ్గుమంటున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే తమ్ముడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు గొడవలకు దారి తీస్తున్నాయి. మేం చంపించే వాళ్లమే అయితే లోకేశ్‌ ను ఎప్పుడో లేపేయించేవాళ్లమని ఆయన అన్న మాటలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై రాప్తాడు వైసీపీ శాసన సభ్యుడు ప్రకాష్ రెడ్డి స్పందించారు.

తన  తమ్ముడు మాట్లాడిన భాష తప్పు కావచ్చు కానీ భావంలో  తప్పు లేదని  రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అంటున్నారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కి మరోసారి ఆజ్యం  పోసేలా, తెలుగుదేశం పార్టీ చర్యలు ఉన్నాయని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అంటున్నారు. విశాఖలో  విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ సోదరుడు మనసు గాయపడి మాట్లాడాడని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు.
 
ఒక ఎమ్మెల్యే ని ఎదుర్కొనే పద్ధతి ఇదేనా అంటూ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి టీడీపీని ప్రశ్నించారు. మా  కుటుంబాన్ని వేధిస్తున్నారని .. మా తమ్ముడిని ఏదైనా చేస్తారని  ఆవేదనతో మా సోదరుడు అలా మాట్లాడి ఉంటాడని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు.  2019 నుండి ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా చూసుకుంటున్నామన్న రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. పరిటాల శ్రీరామ్ బెదిరింపు వెనక  ఉన్న ధైర్యం  చంద్రబాబు నాయుడు లేక లోకేష్ చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టడం కాదా అని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ నేత జగ్గును అరెస్టు చేయడం... ఆయన అనుచరులను ప్రకాశ్ రెడ్డి అనుచరులు కొట్టడం కూడా వివాదానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా పరిటాల సునీత, శ్రీరామ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా చేయడం.. రోజంతా ఉద్రిక్తతలకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: