వైఎస్సార్‌తో ప్రారంభం.. జగన్‌తో సంపూర్ణం..?

బీసీల అభ్యున్నతి వైఎస్‌ రాజశేఖర్‌తో మొదలై.. జగన్‌ పాలనతో సంపూర్ణం అవుతోందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అంటున్నారు.  నిన్న ఓ గీతా కార్మికుడు నా వద్దకు వచ్చాడని... 2007లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఉపయోగించుకొని ఇప్పుడు పోస్టు గ్రాడ్యుయేట్‌ అయ్యిందని చెప్పాడని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ గుర్తు చేసుకున్నారు. దీని కోసం నిజంగా వైయస్‌ఆర్‌కు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని..  దురదృష్టవశాత్తు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాష్ట్రంలో ఒక పెద్ద అవరోధం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు.

చంద్రబాబు సీఎం అయ్యాక ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజులు పెంచి పేద బిడ్డలకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కుదించారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. పేదలను అప్పుల్లో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని..  2019 వరకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది విద్యకు దూరమయ్యారని  మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక దేశానికే దిక్సూచిలా ఓ విద్యా విధానం తీసుకువచ్చారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల  అభివృద్ధి, ఇంగ్లీష్‌ మీడియం, విద్యా కానుక, గోరుముద్ద, ఉన్నత చదువులు చదివే వారికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. ఇవన్నీ చూసిన తరువాత మా కోసమే ఈ పాలకుడు ఉన్నారా అన్నట్లుగా వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని... అయినా ఇంకా కొంత మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారని... వారి జీవన కష్టాన్ని కళ్లతో కాకుండా మనసుతో చూశారని... రోజుకు మూడుసార్లు ప్రమాదకరమైన పరిస్థితిలో వృత్తి సాగిస్తున్నారని.. అందుకే జరగరానిది జరిగితే ఆ కుటుంబం దుస్థితిని మేమందరం సీఎం వైయస్‌ జగన్‌కు వివరించామని తెలిపారు.

సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారని.. అందుకే ఈ కొత్త పాలసీని తీసుకువచ్చారని... కిస్తీని తొలగించడం వంటి కార్యక్రమాలకు గీతా ఉప కులాల తరుఫున సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీలు, పాలాభిషేకాలు చేశారని మంత్రి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: