ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి.. సంచలన విషయాలు?

పాక్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో ఆయన కాలికి గాయమైంది. అయితే ఈ దాడి తర్వాత తొలిసారి దేశప్రజలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్‌ మాట్లాడారు. లాహోర్ లోని ఆస్పత్రిలో వీల్ ఛైర్  మీద నుంచి ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయనపై దాడి జరుగబోతున్నట్లు ఒక రోజు ముందే తెలిసిందట. వజీరాబాద్  లేదా గుజ్రాత్ లో హత్య జరిగేలా ప్రణాళికలు రచించినట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ వివరించారు.

తన హత్య కుట్ర వెనుక నలుగురు ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ వివరించారు. పంజాబ్  గవర్నర్  సల్మాన్  తసీర్ ను చంపినట్లే తన హత్యకు కుట్ర జరిగినట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  తెలిపారు. సామాన్య ప్రజల నుంచి వచ్చానన్న ఆయన తన పార్టీ మిలిటరీ స్థాపన కింద పని చేయదని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌  స్పష్టం చేశారు. తన దగ్గర అతి ముఖ్యమైన వీడియో ఒకటి ఉందన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తనకు ఏదైనా జరిగితే అది బయటకు విడుదల చేసేలా ఏర్పాట్లు చేశానన్నారు.

మొన్నటి దాడిలో ఇమ్రాన్ ఖాన్  కుడి కాలి టిబియా  భాగం దెబ్బతింది. అయితే.. ఆయనపై దాడితో పాకిస్థాన్ లో తక్షణం ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ తో ఆయన పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. దుండగుడి కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం...శస్త్రచికిత్స తర్వాత నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన పార్టీ నేతలు తెలిపారు. ఇమ్రాన్ పై పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని వారు ఆరోపించారు. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్‌ పై హత్యాయత్నం ఘటన పాక్ రాజకీయాలను మరో మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: