ఆ పేరు మార్చండి.. జగన్కు పవన్ సలహా?
ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగవుతాయా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు, సిబ్బంది అందుబాటులో లేరని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో... కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని పవన్ కల్యాణ్ విమర్శించారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు.
మొత్తానికి ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కావాలంటే కొత్త వాటికి వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చని.. కానీ ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ పేరు మార్చడం ఏంటని అనేక మంది అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారు.. పెట్టిన పేరు మారుస్తారా అన్నది చూడాలి.