ఏపీ: ఇంతమంది నేతల నామినేషన్స్ ని తిరస్కరించారా.?

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో  ప్రధాన పార్టీలతో పాటు కొంతమంది  స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఉన్నది. ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కీలక నాయకుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఇందులో వైసిపి, టిడిపి  అభ్యర్థులు కూడా ఉన్నారు. తిరస్కరించబడ్డ కొంతమంది వ్యక్తుల నుంచి వివరణ తీసుకొని కొన్ని నామినేషన్స్ ఓకే చేశారు మరికొన్ని పెండింగ్ లో పెట్టారు. తిరస్కరించబడ్డ వారు ఎవరు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి  హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు.

  ఈయన నామినేషన్ ని ఎన్నికల అధికారులు తిరస్కరించారట.  స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శివశంకర్ రెడ్డి ప్రమాణ పత్రం దాఖలు చేసి దాన్ని ఆర్వో ముందు చదవాల్సి ఉంటుంది. శివశంకర్ రెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ ఈ మధ్య  బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈనెల 18న అతడి తరుపున విద్యాదర్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేయగా  పరిశీలనలో ప్రమాణ పత్రం లేకపోవడంతో ఆర్వో  నామినేషన్ తిరస్కరించింది. అంతేకాకుండా బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పత్రం కూడా ఎన్నికల అధికారులు తిరస్కరించారట. కృష్ణమోహన్ రూ:4.63కోట్ల మీద విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆర్వో  ఫిర్యాదు అందడంతో పెండింగ్ లో ఉంచారట. ఈరోజు ఆ విద్యుత్ బకాయిలకు సంబంధించి వివరాలు అందిస్తే నామినేషన్ పత్రాలు ఆమోదిస్తామని తెలియజేశారట.  అలాగే పెందుర్తి వైసిపి అభ్యర్థి అన్నం రెడ్డి అదిప్ రాజ్  అఫిడవిట్లో క్రిమినల్ కేసుల జాబితాలో  తేదీలను పొందుపరచలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఫిర్యాదు చేశారట.

దీంతో ఆయన లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని అదిప్ రాజును ఆర్వో ఆదేశించారు. ఆయన సంజాయిషీ ఇవ్వడంతో నామినేషన్ ఆమోదం తెలిపారు. అలాగే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నామినేషన్ పత్రం  కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉందని, దాన్ని తిరస్కరించాలని టిడిపి అభ్యర్థి వెగాలపూడి రామకృష్ణ బాబు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పూర్తిగా  తెలియపరచలేదనే అభ్యంతరం తెలియజేశారు. అవన్నీ చిన్నవే అంటూ ఆర్ఓ మయూరి అశోక్ ఎంవీవీ నామినేషన్ ఆమోదం  తెలిపారు. ఇక వీల్లే కాకుండా టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  వంటి వారి నామినేషన్లను కూడా తిరస్కరించారు. తర్వాత వారు సరైన వివరాలు ఇవ్వడంతో ఆమోదం తెలియజేశారు.  ఇక వీళ్లే కాకుండా రాష్ట్రంలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో నామినేషన్లు ఆపివేశారు. వీరంతా శనివారం ఉదయం వరకు పూర్తి వివరాలు తెలియజేస్తేనే నామినేషన్ ఆమోదం లోకి వస్తుందని ఎన్నికల అధికారులు తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: