అమరావతిపై జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం?

ఏపీ సీఎం జగన్‌ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అమరావతి విషయంలో తాజాగా జగన్ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది.  తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామ పంచాయతీలతో అమరావతి మున్సిపాలిటిని ఏర్పాటు చేయబోతోంది. ఈ అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కోసం జగన్ సర్కారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్  ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా కమిషనర్ ఇచ్చిన  ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రామసభల నిర్వహణకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చేశారు. దీని ప్రకారం..  తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు చేస్తారట. ఆ విధంగా నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇలా అమరావతి పేరుతో కార్పొరేషన్‌ ఏర్పాటు కూడా కొత్తదేమీ కాదు.. ఈ ఏడాది జనవరిలో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ పేరుతో రాజధాని పరిధిలో గ్రామ సభలు కూడా  నిర్వహించారు. అయితే. 19 గ్రామాలతో కూడిన కార్పోరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను అన్నీ గ్రామాల్లోనూ జనం తిరస్కరించారు. అయితే.. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న 29గ్రామాలతో కూడిన కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని అన్నిచోట్లా ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేశారు.

కానీ.. ఆ తీర్మానాల్ని పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ మేరకు గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. నోటీసులు అందుకున్న 10రోజుల్లోగా అభ్యంతరాలు తెలిపాలని నోటీసుల్లో చెప్పారు. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటికి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని సర్కారు చెబుతోంది. మరి ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. ఈ సారి జనం ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: