వీడియో ప్లే చేసి మరీ.. భారత్‌ను పొగిడిన పాక్‌ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత దేశాన్ని ప్రశంసించారు. విదేశాంగ విధానం విషయం భారత్ చూపిస్తున్న తెగువను వీడియో ప్రదర్శించి మరీ మెచ్చుకున్నారు. విదేశాంగ విధానం అంటే అలా ఉండాలని.. భారతీయులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సొంత దేశ నేతలకు హితవు పలికారు. భారత దేశం..  ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా స్వతంత్రంగా ఉందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మెచ్చుకున్నారు.

లాహోర్‌ జాతీయ హాకీ స్టేడియంలో కిక్కిరిసిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియోను ఆ సభలో ప్రదర్శించారు. ఒకవైపు భారత్‌ను అమెరికా ఒత్తిడి చేస్తున్నా.. రష్యా నుంచి తక్కువ ధరకు భారత్‌ చమురు కొనుగోలు చేసిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ గుర్తు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌... విదేశాంగ విధానం విషయంలో భారత్‌ సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటోందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మెచ్చుకున్నారు.

యూరప్‌ దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తూ కూడా భారత్‌ పై ఒత్తిడి చేయడాన్ని భారత్‌ దీటుగా ఎదుర్కొన్న విషయాన్ని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. ఆ వీడియో ద్వారా ప్రదర్శించారు. భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని భారత మంత్రి జైశంకర్‌ ప్రశ్నించిన వీడియోను ఇమ్రాన్‌ ప్రదర్శించి పాక్ ప్రజలకు చూపించారు.

భారత పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్థాన్‌ ప్రభుత్వం మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మండిపడ్డారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ భారత్‌ను ఇలా ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేలా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను లండన్‌ నుంచి వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: