జగన్‌, మోడీ.. అప్పుల పంచాయతీ ఎందాక?

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోదీ మధ్య.. కొత్త వివాదం మొదలైంది.. అప్పుల పంచాయతీ ముదురుతోంది. దేశంలోని పది రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయంటూ ఇటీవల కేంద్రం ఆర్బీఐ తో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలని.. హితవు పలికింది. అయితే ఇదే ఇప్పుడు రాష్ట్రాలకు కడుపు మండిస్తోంది. అందుకే ఏపీ వంటి రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఏపీ అప్పుల గురించి మాట్లాడే సమయంలో కేంద్రం తన అప్పుల గురించి కూడా ప్రస్తావించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఎదురుదాడి చేశారు.

2019-20లో కేంద్ర రుణాలు జీడీపీలో 50.90 శాతంగా ఉన్నాయని  ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వివరించారు. ఆ ఏడాదిలో కేంద్రం 1 కోటీ 2 లక్షల 19 వేల 67 కోట్ల రూపాయల రుణాలు చేసిందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ  తెలిపారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం చేసిన అప్పులు 1 కోటీ 35 లక్షల కోట్లకు పెరిగాయని... అదే సమయంలో ఏపీకి 2019-20లో ఏపీ ద్రవ్యలోటు 39,687 కోట్లుగా ఉంటే 2021-22 నాటికి 25,194 కోట్లకు తగ్గించ గలిగామని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వివరించారు.

2019 నాటికి ఏపీ రాష్ట్ర రుణాలు 2, 68, 115 కోట్లు ఉంటే 2022 మార్చి 31 నాటికి 3,81,068 కోట్లుగా ఉందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లకు ఇచ్చిన హామీలు 1,17,730 కోట్లుగా ఉందని.. మొత్తంగా ఏపీ రుణాలు 2022 మార్చినాటికి 4,98,799 కోట్ల రూపాయలుగా ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ వెల్లడించారు.

ఏపీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు సుమారుగా  లక్షన్నర కోట్ల వరకూ ఉండొచ్చన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ... ఉచిత పధకాలను కేంద్రం కేవలం ఆర్ధిక కోణంలోనే చూస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ కోణంలో ఇది స్పష్టంగా సామాజిక పెట్టుబడి మాత్రమేనని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ  పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులు 1.50 కోట్ల కోట్లుగా ఉన్నాయన్న ఆయన.. పెండింగ్ బిల్లుల విషయాన్ని ఏ ప్రభుత్వమూ వెల్లడించలేదని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: